Begin typing your search above and press return to search.
మలైకా-అర్జున్ బ్రేకప్.. అసలు నిజం ఇదీ!
By: Tupaki Desk | 13 Jan 2022 4:30 AM GMTమలైకా అరోరా - అర్జున్ కపూర్ జంట మూడేళ్లకే బ్రేకప్ చెప్పేసిందని అందుకు బలమైన ఆధారం లభించిందంటూ మీడియా సృష్టించిన హంగామా తెలిసిందే. అయితే ఈ జంట విడిపోయారా.. ఇంకా కలిసే ఉన్నారా? అన్నదానికి ఆన్సర్ ఇది.
తాజాగా అర్జున్ కపూర్ ఇన్ స్టా వేదికగా ఓ ఫోటోని షేర్ చేసారు. తాము కలిసి బలంగా ఉన్నామనేదానికి ఇది సంకేతంగా కనిపించింది. ఈ జంట బిగ్గరగా తాము చెప్పాలనుకున్నది ఒక్క ఫోటో సాక్ష్యంతో స్పష్టంగా చెప్పారు. ఈ జంట విడిపోయినట్లు సోషల్ మీడియా కథనాలు వేడెక్కించిన తరుణంలో వీరిద్దరూ ట్విట్టర్ లో టాప్ ట్రెండ్ లలో నిలిచారు. అయితే మలైకాతో తన అనుబంధాన్ని ధృవీకరిస్తూ అర్జున్ కపూర్ షేర్ చేసిన హగ్ ఫోటోగ్రాఫ్ ఇంతలోనే మరోసారి ట్రెండ్ అయ్యింది.
ఒకే ఒక్క ఫోటోతో అర్జున్ అన్నిటికీ సమాధానమిచ్చాడు. యువనటుడు తన లేడీ లవ్‌తో మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేయడం ద్వారా ఆ వార్తల్ని కొట్టిపారేశాడు. ``అవమానకరమైన పుకార్లకు చోటు లేదు. సురక్షితంగా ఉండండి. ఆశీర్వదించండి. ప్రజలకు శుభాకాంక్షలు. అందరినీ ప్రేమించండి`` అంటూ వ్యాఖ్యల్ని ఈ ఫోటోకి జోడించాడు.
వెంటనే బాలీవుడ్ ప్రముఖుల నుంచి స్పందనలు అంతే వేగంగా దూసుకొచ్చాయి. స్నేహితులు అభిమానులు ఈ జంటను ప్రశంసించడానికి వ్యాఖ్యల విభాగానికి చేరుకున్నారు. మలైకా కూడా అర్జున్ పోస్ట్ పై సాధ్యమైనంత సునాయాసంగా స్పందించింది. క్లుప్తంగా సరళంగా స్టైల్ ఐకాన్ అన్ని సందేహాలను నివృత్తి చేస్తూ.. వ్యాఖ్యల బాక్స్ లో హార్ట్ ఎమోజీని షేర్ చేసింది. ఈ పోస్ట్ పై స్పందించిన వారిలో నటి తారా సుతారియా కూడా ఉన్నారు. ``అవును! మీరు అబ్బాయిలు`` అంటూ వ్యాఖ్యానించింది. తదుపరి చిత్రం `లేడీ కిల్లర్`లో అర్జున్ తో స్క్రీన్ స్పేస్ ను పంచుకోనున్న నటి భూమి పెడ్నేకర్ కూడా హార్ట్ అండ్ హగ్స్ ఎమోజీని షేర్ చేసింది. అర్జున్ పోస్ట్ పై స్పందించిన వారిలో అమృత అరోరా- సోఫీ చౌదరి- అతియా శెట్టి- తాహిరా కశ్యప్- అమీ జాక్సన్ ఉన్నారు.
ఈ జం విడిపోయారంటూ ప్రముఖ బాలీవుడ్ మీడియా కథనం తొలుత వైరల్ అయ్యింది. ఈ కథనంలో ఏం రాసారు అంటే? ``ఇప్పటికి ఆరు రోజులకు పైగా మలైకా అరోరా తన ఇంటి నుండి బయటకు రాలేదు. ఆమె పూర్తిగా ఒంటరిగా ఉంది. ఆమె చాలా విచారంగా ఉంది. బ్రేకప్ న నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. కొంతకాలం పాటు ప్రపంచానికి దూరంగా ఉండడానికి నిర్ణయించుకుంది. అర్జున్ కపూర్ కూడా ఇటీవలి కాలంలో ఒక్కసారి కూడా ఆమెను చూడలేదు.వాస్తవానికి అర్జున్ మూడు రోజుల క్రితం సోదరి రియా కపూర్ ఇంట్లో విందు కోసం కనిపించాడు.రియా ఇల్లు మలైకా ఇంటికి చాలా దగ్గరగా ఉంది. మలైకాకు సమీపంగా వచ్చినా అతను రాత్రి భోజనం తర్వాత వెళ్లి ఆమెను కలవలేదు. మలైకా సాధారణంగా ఈ ఫ్యామిలీ డిన్నర్ లకు అర్జున్ తో కలిసి హాజరవుతుంది.. కానీ ఈసారి ఆమె అతనితో కనిపించలేదు`` అంటూ కథనం వేడెక్కించింది. ఈ కథనం చదివిన వారికి మైండ్ బ్లాక్ అయ్యింది. బాలీవుడ్ లో అన్యోన్య జంటగా కొనసాగుతున్న వారిపై ఇలాంటి కథనం .. నిజంగా నిజమేనని నమ్మిస్తూ సంచలనంగా మారింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అర్జున్ కపూర్ తదుపరి `ది లేడీ కిల్లర్` లో నటిస్తున్నారు. అజయ్ బహ్ల్ దర్శకత్వం వహిస్తారు. బి.ఎ. పాస్.. 2012 చిత్రాల్ని అతడు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. టి-సిరీస్ కు చెందిన భూషణ్ కుమార్ -శైలేష్ ఆర్. సింగ్ నిర్మిస్తున్నారు. ఇందులో ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన ప్లేబాయ్ గా అర్జున్ నటిస్తున్నాడు.ఇది కాకుండా అర్జున్ తదుపరి మోహిత్ సూరి `ఏక్ విలన్ 2`.. ఇంకా పేరు పెట్టని జగన్ శక్తి దర్శకత్వంలోని సినిమా చేస్తున్నాడు. జగన్ శక్తి మూవీలో జాన్ అబ్రహంతో కలిసి అర్జున్ నటించనున్నారు.