Begin typing your search above and press return to search.
'భీమ్లా నాయక్' కాస్త దిగిరా నాయనా!
By: Tupaki Desk | 21 Dec 2021 4:37 AM GMTపవన్ కల్యాణ్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'భీమ్లా నాయక్' పైనే ఉంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి ఇది రీమేక్. రానా కూడా మరో ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉండగా, నాయికలుగా నిత్యా మీనన్ .. సంయుక్త మీనన్ కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అంచనాలు పెంచేస్తూ వెళుతున్నాయి.
సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇంతకుముందే ప్రకటించారు. ఆ తరువాత రోజునే 'సర్కారువారి పాట' .. ఆ మరునాడే 'రాధేశ్యామ్' ఉన్నప్పటికీ 'భీమ్లా నాయక్' లైట్ తీసుకున్నాడు. ఇక ఆ తరువాతనే 'ఆర్ ఆర్ ఆర్' సినిమా బరిలోకి దిగడానికి జనవరి 7వ తేదీని ఎంచుకుంది. 'ఆర్ ఆర్ ఆర్' ధాటిని తట్టుకోవడం కష్టమనే ఉద్దేశంతో 'సర్కారువారి పాట' ఏప్రిల్ కి వెళ్లిపోయింది. 'రాధేశ్యామ్' పాన్ ఇండియా స్థాయి సినిమా కావడం వలన దానిని కదిలిస్తే కష్టమైపోతుంది. అందువల్ల వాళ్లు అక్కడే ఉన్నారు.
'భీమ్లా నాయక్' కూడా వేరే డేట్ చూసుకోవడం ఖాయమనే టాక్ వినిపించింది. ఎవరు ఎప్పుడు వస్తే నాకెందుకు .. నా దారి రహదారి అన్నట్టుగా 'భీమ్లా నాయక్' అక్కడే భీష్మించుకు కూర్చున్నాడు. అసలే ఇది హీరోలు తమ క్రేజ్ ను కొలుచుకునే సంక్రాంతి సీజన్. ఈ బరిలో నుంచి ఇప్పుడు తప్పుకుంటే జనంలోకి వేరే సంకేతాలు వెళతాయి. అభిమానులు కూడా హర్ట్ అవుతారు. అందువలన 'భీమ్లా నాయక్' పట్టువదలని విక్రమార్కుడిలా చెక్కుచెదరకుండా ఉన్నాడు. దాంతో ఇప్పుడు ఆయనను ఈ బారి నుంచి తప్పుకోవలసిందిగా మీడియా ముఖంగా కోరడానికి దిల్ రాజు .. యూవీ వంశీ .. డీవీవీ దానయ్య సిద్ధమవుతున్నారట.
మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేయడం ఎందుకు? పర్సనల్ కలిసి అడగొచ్చుగా అనుకోవడం సహజం. కానీ అప్పుడు జరిగినదేవిటో తెలియక ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. వేరే కామెంట్లను వాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ కారణంగా గొడవలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అందువలన ఇతర నిర్మాతల అభ్యర్థన మేరకు పవన్ తప్పుకున్నట్టుగా ఉండాలి.
పవన్ గౌరవం ఏ మాత్రం తగ్గకుండా .. ఆయన ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా 'భీమ్లా నాయక్'ను సైడ్ చేయడానికి నిర్మాతలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గురించి వాళ్లు త్రివిక్రమ్ కి సమాచారం అందించినట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. చివరికి జరిగేది ఈ నిర్మాతల రిక్వెస్ట్ ను పవన్ అర్థం చేసుకుని .. ఓకే అనేయడమేననేది ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న మాట.