Begin typing your search above and press return to search.
కాంతార ఓటీటీ స్ట్రీమింగ్ పై ఫుల్ క్లారిటీ.. ఆశ పడ్డ వారికి నిరాశే
By: Tupaki Desk | 28 Oct 2022 3:58 AM GMTఒక చిన్న లైన్ ను అత్యుద్భుతంగా.. ఇప్పటివరకు ఎవరు చెప్పని.. చూపించని రీతిలో చెప్పిన చిత్రం 'కాంతార'. ఈ సినిమా నిర్మాణం మొదలు విడుదలయ్యే వరకు ఎలాంటి అంచనాలు లేని సంగతి తెలిసిందే. అలాంటి ఈ మూవీ అద్భుత విజయాన్ని సాధించటమే కాదు.. సినిమాల్ని తక్కువగా చూసే వారు సైతం.. ఒకసారి చూడాలని ఫిక్స్ కావటం తెలిసిందే. ఈ కారణంతోనే.. ఈ మూవీ విడుదలైన వారాలు గడుస్తున్నా.. సినిమా మీద క్రేజ్ మాత్రం తగ్గని పరిస్థితి. ఇటీవల కాలంలో సినిమా విడుదలై వారాల తరబడి థియేటర్లలో ప్రదర్శించిన అతి తక్కువ సినిమాల్లో కాంతార ఒకటిగా చెప్పాలి.
అప్పట్లో హిందీ మూవీ కశ్మీర్ ఫైల్స్ ఎలా అయితే మౌత్ టాక్ తో.. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించిందో.. దాదాపుగా అదే సీన్ కాంతార విషయంలోనూ రిపీట్ అయ్యింది. ఈ సినిమా విడుదలై మూడో వారంలోకి వచ్చినా.. ఈ సినిమాను ప్రదర్శించే స్క్రీన్లు పెరుగుతున్నాయే తప్పించి.. తగ్గని పరిస్థితి. వీక్ డేస్.. వీకెండ్స్ అన్న తేడా లేకుండా థియేటర్లు ఫుల్ అవుతున్నాయి.
ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఎంతన్న విషయం ప్రేక్షకులు థియేటర్లు వస్తున్న వైనం ఇట్టే చెప్పేస్తోంది. అయితే.. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారని.. డేట్ వచ్చేస్తుందంటూ ఒక నిరాధారమైన వార్త ఒకటి హడావుడి చేస్తోంది. ఈ కన్నడ డబ్బింగ్ మూవీని చూసేందుకు తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్న వేళ.. ఓటీటీ స్ట్రీమింగ్ వార్త కలెక్షన్ల మీద ప్రభావం చూపటం ఖాయం.
ఇదే విషయాన్ని గుర్తించిన చిత్ర నిర్మాత రియాక్టు అయ్యారు. ఓటీటీ స్ట్రీమింగ్ మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పట్లో ఈ మూవీని ఓటీటీలో విడుదల చేసే ఆలోచన లేదన్నారు.
ఓటీటీ స్ట్రీమింగ్ రూమర్ కర్ణాటకలో మొదలై రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చినట్లుగా చిత్ర నిర్మాత పేర్కొంటున్నారు. నవంబరు నాలుగున కాంతార మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారన్నది రూమర్ మాత్రమే అని.. ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు విడుదల చేసేది తాము అధికారికంగా ప్రకటన చేస్తామని పేర్కొన్నారు.
'ప్రస్తుతానికి ఓటీటీలో విడుదల చేస్తున్నారంటూ వచ్చిన వార్త నిజం కాదు' అని స్పష్టం చేశారు. కన్నడంలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ మూవీగా నిలవటమే కాదు.. తెలుగులో అక్టోబరు 15న విడుదలై.. నేటికీ విజయవంతంగా నడుస్తోంది. రిషిబ్ శెట్టి హీరోగానే కాదు దర్శకుడిగా వ్యవహరించిన ఈ చిత్రం.. రికార్డుల్ని తిరగరాస్తోంది. సౌతిండియా సినిమా సత్తా ఏమిటో చాటుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.