Begin typing your search above and press return to search.

నాగశౌర్య విషయంలో అది పుకారు మాత్రమే!

By:  Tupaki Desk   |   2 April 2022 9:45 AM GMT
నాగశౌర్య విషయంలో అది పుకారు మాత్రమే!
X
టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్న యంగ్ హీరోల జాబితాలో నాగశౌర్య ఒకరుగా కనిపిస్తాడు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే హ్యాండ్సమ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అమ్మాయిల్లో తనకి మంచి ఫాలోయింగ్ ఉండటం విశేషం. లవర్ బోయ్ ఇమేజ్ నుంచి బయటపడి, యాక్షన్ హీరోగానూ మంచి మార్కులు సంపాదించుకోవాలనే దిశగా ఆయన ప్రయాణం కొనసాగుతోంది. తాజా ఇంటర్వ్యూలో అతని గురించి తల్లి ఉషా ప్రసాద్ మాట్లాడారు.

"మాకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు .. నాగశౌర్యకి ఎవరి సపోర్ట్ లేదు. అందువలన తను సినిమాల్లోకి వెళతానని చెప్పినప్పుడు కూడా నేను వద్దనే చెప్పాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో నెగ్గుకురావడం కష్టమనే అన్నాను. కానీ వాళ్ల నాన్న బాగానే సపోర్టు చేశారు. అప్పటి నుంచి నాగశౌర్య తనంతట తానుగా ఎదిగాడు .. ఇంతవరకూ జరిగిన ఆయన జర్నీ సంతోషంగానే ఉంది .. అయితే తను అనుకున్న స్థాయికి ఇంకా రీచ్ కాలేదనేదైతే మనసులో ఉంది. అనుకున్నది సాధిస్తాడనే గట్టి నమ్మకం ఉంది.

సినిమాల్లోకి రావడానికి నాగశౌర్య చాలా కష్టపడ్డాడు. అలా కష్టపడితేనే పైకి వస్తారని తెలుసును గనుక, ఆ విషయాన్ని గురించి నేను ఎప్పుడూ బాధపడలేదు. తను ఓ గోల్ అనుకుని ఆ దిశగా వెళుతూ ఉంటే, ఎంకరేజ్ చేస్తాను అంతే. నాగశౌర్య కెరియర్ ఆరంభంలో .. తను ఎన్టీఆర్ భార్య 'ప్రణతి'కి కజిన్ అవుతాడనే టాక్ వచ్చింది. వాళ్ల సపోర్ట్ తోనే సినిమాల్లోకి వచ్చాడని చెప్పుకున్నారు .. కానీ అలాంటిదేమీ లేదు. ప్రణతి వాళ్ల కజిన్ పూజిత్ .. నాగశౌర్య మంచి ఫ్రెండ్స్ .. అంతే. అంతకుమించిన బంధుత్వమైతే లేదు.

ఎన్టీఆర్ ఫ్యామిలీకి చాలా దగ్గర కదా అని ఏ నిర్మాతలు కలవడం జరగలేదు .. ఎన్టీఆర్ సజేషన్స్ ఇస్తారనే మాటలోను నిజం లేదు .. అదంతా పుకారు మాత్రమే. మొదటి నుంచి కూడా నాగశౌర్య .. ఎన్టీఆర్ కి వీరాభిమాని. తనకంటూ సొంత అభిప్రాయాలు .. నిర్ణయాలు ఉంటాయి. తనకి నచ్చినట్టుగానే ఉండనీయమని మేము అనుకుంటాము. తనది చాలా డిఫరెంట్ మెంటాలిటీ. ఫోన్ కూడా ఎక్కువగా వాడడు. మొదటి నుంచి కూడా తనకి ఇది కావాలని అడగడు. అతని మనసు తెలుసుకును మేమే ఏర్పాటు చేస్తుంటాము. అతను అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువకావడమనేది మాకు సంతోషాన్ని కలిగించే విషయం" అని చెప్పుకొచ్చారు.