Begin typing your search above and press return to search.
RRR లానే రాధేశ్యామ్ వాయిదా నిజమా?
By: Tupaki Desk | 2 Jan 2022 6:05 AM GMTడార్లింగ్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ రిలీజ్ తేదీపై కోవిడ్ క్రైసిస్ వల్ల ఆరంభం కొంత డైలమా నెలకొన్న సంగతి తెలిసిందే. 2021 సమ్మర్ దసరా దీపావళి డిసెంబర్ అంటూ రకరకాల ఊహాగానాలు సాగాయి. అధికారికంగా అనుకున్న తేదీకి కూడా రిలీజ్ చేయడం కుదరలేదు. సెకండ్ వేవ్ పరిశ్రమను పూర్తి కన్ఫ్యూజన్ లోకి నెట్టేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆ తర్వాత సంక్రాంతి 2022 బరిలో రిలీజ్ చేయాలని భావించిన రాధేశ్యామ్ మేకర్స్ తాము చెప్పిన తేదీకి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి ఉన్నారు. జనవరి 14న మా సినిమాని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించింది మొదలు అదే తేదీకి కట్టుబడి ఉన్నారు. పోస్టర్లు టీజర్లు ట్రైలర్ అన్నిచోట్లా ఈ తేదీని ఫిక్స్ చేసి విడుదల చేసిన సంగతి తెలిసింందే. అయితే ఇంతలోనే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీని వాయిదా వేస్తూ జక్కన్న టీమ్ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరిచింది.
ఒమిక్రాన్ హైటెన్షన్స్ నడుమ ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ రిలీజ్ ని వాయిదా వేశారు. కానీ రాధేశ్యామ్ నిర్మాతల్లో మాత్రం ఇసుమంత కూడా టెన్షన్ కనిపించడం లేదు. ఓ వైపు కోవిడ్-19 యొక్క మూడవ వేవ్ గురించి ప్రజలు చాలా ఆందోళన చెందుతుండగా.. సినిమా పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమవుతోంది. RRR వాయిదా తర్వాత పాన్ ఇండియన్ చిత్రం రాధే శ్యామ్ సహా ఇతర పెద్ద చిత్రాల రిలీజ్ లు కష్టమేనని ప్రజలు భావించారు.
కానీ ప్రభాస్ రాధేశ్యామ్ 14 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇంకా ఎలాంటి సినిమా ప్రమోషన్ లు లేకపోయినా రిలీజ్ తేదీని మార్చలేదు. ప్రచారం సరిగా లేని కారణంగా రాధే శ్యామ్ కూడా వాయిదా పడవచ్చని పుకార్లు వినిపించినా మేకర్స్ తేదీని మార్చకపోవడం ఆశ్చర్యపరిచింది. రాధేశ్యామ్ టీమ్ పుకార్లను ఖండిస్తూ తాజాగా మరోసారి రిలీజ్ తేదీని ప్రకటించింది. జనవరి 14న యథాతథంగా మా సినిమాని విడుదల చేస్తామని ఎటువంటి మార్పు ఉండదని తెలిపింది.
``రాధే శ్యామ్ విడుదల ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదు. ప్రభాస్ నటించిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పుకార్లను నమ్మవద్దు`` అని వెల్లడించారు. కారణం ఏదైనా కానీ ప్రభాస్ అభిమానులకు ఇది పెద్ద శుభవార్త. విక్రమ్ ఆదిత్య -ప్రేరణల లవ్ స్టోరి మ్యాజిక్ ను తెరపై చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని T సిరీస్‌తో కలిసి UV క్రియేషన్స్ నిర్మించింది. గోపికృష్ణ మూవీస్ బ్యానర్ సమర్పిస్తోంది.