Begin typing your search above and press return to search.
RRR రిలీజ్ ఎప్పుడంటే..?
By: Tupaki Desk | 20 Jan 2022 6:56 AM GMTదర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే విడుదల కావాల్సిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని మూడు సార్లు వాయిదా వేశారు. చివరగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసిన మేకర్స్.. దానికి తగ్గట్టుగానే భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈసారి దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం.. థర్డ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో విడుదల పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది.
RRR సినిమాకు రాబోయే మంచి సీజన్ అంటే సమ్మర్ అనే అనుకోవాలి. అందులోనూ మార్చి లోగా కరోనా వేవ్ ప్రభావం తగ్గే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జక్కన్న అండ్ టీమ్ వేసవిలో రిలీజ్ డేట్ ని లాక్ చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ నెల చివరి వారం లేదా మే మొదటి వారంలో 'ఆర్ ఆర్ ఆర్' కొత్త విడుదల తేదీ ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
అయితే సమ్మర్ సీజన్ కోసం ఇప్పటికే పలు క్రేజీ మూవీస్ రిలీజ్ డేట్స్ ని ఖరారు చేసి పెట్టుకున్నాయి. ఒకవేళ ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా అదే సమయానికి రావాలని చూస్తే మాత్రం.. మిగతా చిత్రాలన్నీ మరో విడుదల తేదీలను చూసుకోక తప్పదు. అంతేకాదు మిగతా చిన్న మీడియం రేంజు సినిమాలన్నీ రీ షెడ్యూల్ చేయబడతాయి. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.
కాగా, విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమరం భీమ్ పాత్రలతో కల్పిత కథతో ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రాన్ని రాజమౌళి రూపొందించారు. చరిత్రలో కలిసారో లేదో తెలియని ఈ ఇద్దరు వీరుల మధ్య స్నేహాన్ని ప్రధానంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో రామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు.
అలియా భట్ - అజయ్ దేవగణ్ - ఒలివియా మోరీస్ - సముద్ర ఖని - శ్రీయా కీలక పాత్రలలో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. RRR చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.