Begin typing your search above and press return to search.

స‌ర్కారు వారి పండ‌గ‌ ట్రీట్ లేన‌ట్టే

By:  Tupaki Desk   |   14 Jan 2022 6:30 AM GMT
స‌ర్కారు వారి పండ‌గ‌ ట్రీట్ లేన‌ట్టే
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. థ‌ర్డ్ వేవ్ త‌ర్వాత ప‌రిస్థితులు అదుప‌లో ఉంటే ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయాల‌ని టీమ్ ప్లాన్ చేస్తోంది. వాస్త‌వానికి సంక్రాంతి కి రిలీజ్ తో ఫ్యాన్స్ కి పెద్ద ట్రీట్ ఇవ్వాల‌ని ప్లాన్ చేసారు. కానీ `ఆర్.ఆర్.ఆర్` సినిమా బ‌రిలో ఉండ‌టంతో మ‌హేష్ స‌హా ప‌లువురు హీరోలు వెన‌క్కి త‌గ్గారు. చివ‌రికి `ఆర్.ఆర్.ఆర్ వెన‌క్కి త‌గ్గ‌గా.. మిగ‌తా అగ్ర హీరోల రిలీజ్ ల‌కు చోటు లేకుండా పోయింది.

ఇక సంక్రాంతి కి అగ్ర హీరోలంతా కేవ‌లం పోస్ట‌ర్లు.. టీజ‌ర్లు.. ట్రైల‌ర్లు.. లిరిక‌ల్స్ రిలీజ్ ల‌ తోనే స‌రిపెట్టుకోవాలి. ఆ ర‌కంగానైనా సర్కారు వారు అభిమానుల్ని ఖుషీ చేస్తార‌ని ఆశ‌ప‌డే అవ‌కాశం లేకుండా చేసారు. ఈ సినిమాకి సంబంధించిన తొలి లిరిక‌ల్ సాంగ్ ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాలి. జ‌న‌వ‌రి మొద‌టి వారంలోనే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసారు. అప్పుడు వాయిదా ప‌డినా పండుగ సంద‌ర్భంగానైనా రిలీజ్ అవుతుంద‌ని అంతా భావించారు. కానీ అదీ జ‌ర‌గ‌లేదు. తాజాగా జ‌న‌వ‌రి 26న‌ ఫ‌స్ట్ సింగిల్ ని రిలీజ్ చేయాన‌లి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్ప‌టికే మ‌హేష్-థ‌మ‌న్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `దూకుడు`..`ఆగ‌డు`...`బిజినెస్ మేన్` చిత్రాలు మ్యూజిక‌ల్ గా ఎలాంటి స‌క్సెస్ సాధించాయో తెలిసిందే. ఆ న‌మ్మ‌కంతోనే మ‌రోసారి ఈ కాంబినేష‌న్ లో మ‌రో చిత్రం రాబోతుంది. టాలీవుడ్ లో థ‌మ‌న్ హ్యాండ్ రైజింగ్ లోనూ ఉంది. అగ్ర హీరోల చిత్రాల‌కు థ‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌నిచేస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ -త‌మ‌న్ మ‌ధ్య‌ ఆ ర‌క‌మైన పోటీ ఉంద‌ని ప‌రిశ్ర‌మ‌లో టాక్ చాలా కాలంగా వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే.