Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్ సినిమా రీమేక్ రిలీజ్ పుకార్లకు చెక్‌

By:  Tupaki Desk   |   29 Aug 2022 6:23 AM GMT
సూపర్‌ హిట్ సినిమా రీమేక్ రిలీజ్ పుకార్లకు చెక్‌
X
సూర్య హీరోగా తెరకెక్కి సూపర్‌ హిట్ అయిన సూరారై పోట్రు సినిమా ను ప్రస్తుతం హిందీలో అక్షయ్‌ కుమార్‌ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. తమిళ్ లో సూపర్‌ హిట్ అయిన ఈ సినిమా ను హిందీలో రీమేక్ చేస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా సూర్య ఈ సినిమా ను స్వయంగా నిర్మించడంతో పాటు కీలకమైన గెస్ట్‌ రోల్‌ లో కూడా కనిపించబోతున్నాడు.

సూరారై పోట్రు సినిమా ను కరోనా కారణంగా డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా విడుదల చేసిన విషయం తెల్సిందే. ఓటీటీ లో విడుదల అయినా కూడా మంచి స్పందన దక్కించుకుంది. ఒక వేళ ఈ సినిమా థియేట్రికల్‌ రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా వంద కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసి ఉండేది అంటూ ఆ సమయంలో టాక్‌ వచ్చింది.

సూర్య సినిమా ఓటీటీ లో రిలీజ్ అయినా ఇప్పుడు ఆ సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న సినిమా బిగ్ స్క్రీన్‌ లో చూసే అవకాశం ఉందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సూరారై పోట్రు హిందీ రీమేక్ కూడా డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా రిలీజ్ అవ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో అక్షయ్‌ కుమార్‌ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా విడుదల అవుతున్న నేపథ్యంలో రీమేక్ కూడా ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కానీ చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఈ రీమేక్ ను ఎట్టి పరిస్థితుల్లో థియేట్రికల్‌ రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. యూనిట్‌ సభ్యుల క్లారిటీతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఊపిరి పీల్చు కుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.