Begin typing your search above and press return to search.
స్టార్ రైటర్ కొత్త ధంధా లాభ సాటిగా ఉందట!
By: Tupaki Desk | 27 Dec 2019 5:10 AM GMTఆయనో పెద్ద రైటర్. టాలీవుడ్ లో పీక్స్ లో స్టార్ డమ్ చూసిన రచయితలలో ఆయనొకరు. ఒక దశలో అయన వెనక నుంచి దర్శకత్వం కూడా వహించి హిట్లు సాధించిన రోజులు ఉన్నాయి. అయితే అందరికీ ఒకే రకమైన స్థాయి ఎప్పుడూ ఉండదు కదా. ఆయన హవా కూడా తగ్గి పోయింది. మునుపు ఉన్నంత డిమాండ్ ఇప్పుడు లేదు. అయితే ఆయన ఇప్పుడు రూటు మార్చారు. కొత్త రూట్లో ప్రాజెక్టులు సెట్ చేసుకుంటూ కొత్త ధంధా మొదలు పెట్టాడు.
ఇదెలా అంటే.. ఆయనకు ఇండస్ట్రీలో అందరితో పరిచయాలు ఉన్నాయి. సీనియర్ స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకూ.. సీనియర్ మోస్ట్ నిర్మాతల నుంచి నిర్మాణంలో ఓనమాలు తెలియని కొత్త నిర్మాతల వరకూ ఆయనకు పరిచయం ఉన్నావారే. ఇక దర్శకుల సంగతి సరే సరి. దీంతో ఈ పీఆర్ నెట్వర్క్ తోనే తన ధంధా కొనసాగిస్తున్నాడు. ఒక హిట్ సాధించి మరో సినిమా సెట్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్న దర్శకులను.. హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలకు వంతెనలా వ్యవహరిస్తూ కాంబినేషన్ సెట్ చేస్తున్నాడట. ఇలా ప్రాజెక్టు సెట్ చేసినందుకు కోటి రూపాయాలు ఫీజుగా పుచ్చుకుంటాడట. ఇక కొత్త దర్శకులు.. ప్రాజెక్ట్ సెట్ చేసుకో లేక ఇబ్బంది పడే వారికి ప్రాజెక్ట్ సెట్ చేస్తూనే కథను తనదిగా చెప్పుకుని టైటిల్ క్రెడిట్ తీసుకుంటాడట.
అంతే కాకుండా ఇద్దరు రైటర్ల ను పెట్టుకుని కథలు వండే తతంగం కూడా సాగుతోందట. ఈ కథలకు తన బ్రాండ్ ఉంటుంది కాబట్టి ఎవరో ఒక నిర్మాతకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇలా సదరు రచయిత కొత్త ధంధా మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోందట. ఈ విషయం తెలిసిన డిమాండ్ లేని ఇతర సీనియర్ రచయితలు 'మన్మథుడు' లో బ్రమ్మి తరహాలో ఈ సంగతి తెలీక అనవసరంగా కష్టపడి కథలు రాస్తున్నామే అనుకుంటూ వాపోతున్నారట.