Begin typing your search above and press return to search.

పవన్ రీ-ఎంట్రీ: పీక్స్ లో ఉన్న గాసిప్పులు!

By:  Tupaki Desk   |   23 Oct 2019 9:08 AM GMT
పవన్ రీ-ఎంట్రీ: పీక్స్ లో ఉన్న గాసిప్పులు!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత జనసేన అధ్యక్షుడిగా పవన్ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అయితే గత కొంతకాలంగా పవన్ రీ ఎంట్రీ గురించి వార్తలు జోరుగా వస్తున్నాయి. తన పునరాగమనంపై పవన్ స్వయంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.

పవన్ రీ ఎంట్రీ సినిమా కోసం పలువురు టాలీవుడ్ దర్శకులు కథలు ప్రిపేర్ చేస్తున్నారని అంటున్నారు. పవన్ సినిమా విషయంలో ఈమధ్య క్రిష్ పేరు కూడా జోరుగా వినిపించింది. ఇదిలా ఉంటే 'పింక్' సినిమా రీమేక్ లో నటించేందుకు పవన్ పచ్చజెండా ఊపారని.. ఈ సినిమాను బోనీ కపూర్.. దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తారని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో రూమర్లు ఎంత పీక్స్ కు వెళ్ళిపోయాయంటే వినేవారికి ఒక్కసారిగా షాక్ తగలడం కూడా ఖాయం. 'పింక్' సినిమా తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసే భాద్యతను మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అప్పజెప్పారని అంటున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' సినిమాతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ 'పింక్' రీమేక్ డైలాగ్ వెర్షన్ పై వర్క్ చేస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించరని.. హరీష్ శంకర్ లేదా మరో డైరెక్టర్ దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందనేది రూమర్ల సారాంశం.

ఇంతే కాదు.. ఈ స్టొరీలు ఇంకా ఇంకా అల్లుతున్నారు. కానీ ఇన్ సైడ్ టాక్ ఏంటంటే ఇంకా పవన్ 'పింక్' రీమేక్ సినిమాకే కాదు అసలు ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. పవన్ సరే అనకముందే ఈ రూమర్లు డైలాగ్స్ వరకూ వెళ్ళిపోయాయి. నాలుగు రోజులు ఆగితే పవన్ కు తెలియకుండానే పవన్ సినిమా లాంచ్ డేట్ కూడా ఫిక్స్ చేస్తారేమో!