Begin typing your search above and press return to search.

ప్రెగ్నెంటా?? అవన్నీ వట్టి రూమర్లే

By:  Tupaki Desk   |   17 May 2016 9:32 AM GMT
ప్రెగ్నెంటా?? అవన్నీ వట్టి రూమర్లే
X
కాస్త బొజ్జ కనిపించినంత మాత్రాన గర్భవతి అనుకుంటే ఎలా? సరిగ్గా బ్యూటీ క్వీన్‌ ఐశ్వర్య రాయ్‌ విషయంలో ఇదే జరిగింది. అమ్మడు బొద్దు నుండి స్లిమ్‌ అయ్యింది అని మనం ఫోటో షూట్లు చూసి చెప్పుకోవడమే కాని.. నిజానికి ఆమె వెయిట్‌ తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు అనే విషయం తెలియదు కాని.. ఐష్‌ మాత్రం.. 42 ఏళ్ల ఆంటీలా బొద్దుగానే ఉంది. ఇక ఈ ప్రెగ్నెంట్ రూమర్లు ఎలా వచ్చాయో తెలిసిందే.

అమ్మడు మొన్న కేన్స్‌ వెళ్ళినప్పుడు.. అక్కడ ఆలీ యునిస్‌ డిజైన్‌ చేసిన గౌను వేసుకుంది. అయితే ఆమె సెక్సీ క్లీవేజ్ కంటే కూడా.. ఆమె వెయిస్ట్ భాగంలో ముందుకు తోసుకొస్తున్న ఆ బుజ్జి పొట్టనే అభిమానులు ఎక్కువగా చూసినట్లున్నారు. కన్ఫామ్‌ ఐష్‌ మళ్ళీ ప్రెగ్నెంట్ అంటూ నానా హడావుడి చేశారు. ఆమె పొట్ట చుట్టూ రింగులు వేసి మరీ నెట్‌ లో ఆ ఫోటోలను సర్కులేట్‌ చేశారునుకోండి. అయితే అందులో అస్సలు నిజంలేదని ఐష్‌ పి.ఆర్‌. చెప్పేసింది.

ఐశ్వర్య ప్రెగ్నెంట్ కాదు. ఆ డ్రెస్ లో ఆమె బాడీ షేప్‌ అలా అనిపించి ఉండొచ్చు. ఇలాంటి రూమర్లను స్ర్పెడ్‌ చేయకండి అంటూ అఫీషియల్‌ గా ఒక స్టేట్మెంట్‌ ఇచ్చేశారు. సో.. ఇప్పటికే ఆరాధ్యకు జన్మనిచ్చిన ఐష్‌-అభిషేక్‌ దంపతులు.. ఇంకా టైమ్‌ తీసుకోనున్నారనమాట. ఇంకా పెద్ద షాక్‌ ఏంటంటే.. మామూలుగా వారం రోజుల పాటు కేన్స్ చలనచిత్రోత్సవంలో సందడి చేసే ఐష్‌.. రెండు రోజులకే ప్యాక్‌ చేసుకొని ఇంటికొచ్చేసింది.