Begin typing your search above and press return to search.

అప్పుడే కొరటాల రీమేక్‌ ఏంటండీ?

By:  Tupaki Desk   |   30 May 2016 9:30 AM GMT
అప్పుడే కొరటాల రీమేక్‌ ఏంటండీ?
X
రూమర్లకు అంతూ పంతూ లేదు. ఒక ప్రక్కన వైవిధ్యబరితమైన సినిమాలతో చితక్కొట్టేస్తున్నాడు కొరటాల శివ. తొలి సినిమా మిర్చి హిట్టయ్యాక.. కాస్త టైమ్‌ తీసుకుని శ్రీమంతుడు చేసి.. ఔరా అనిపించుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్‌ సినిమాను చేస్తున్నాడు. అయితే తన 4వ సినిమాగా ఒక రీమేక్‌ మూవి ఎంచుకున్నాడని ఇప్పుడు టాక్‌.

వాస్తవానికి అఖిల్‌ ఉన్నాడు చూడండీ.. మనోడితో మళయాళం సినిమా ''కమ్మటి పదం'' రీమేక్‌ చేస్తే బాగుంటుందని ఒక న్యూస్ వచ్చింది. స్వయంగా ఆ సినిమా నిర్మాతలే మేము బాలీవుడ్ లో అర్జున్ కపూర్ తెలుగులో అఖిల్‌ తో డిస్కషన్లు జరుపుతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఆ తరువాత దర్శకుడు కొరటాల శివ.. నిర్మాత డివివి దానయ్య కోసం అఖిల్‌ తో ఒక సినిమా చేస్తున్నాడని మరో టాక్‌ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి.. కొరటాల డైరక్ట్ చేసేది కమ్మటి పదం తెలుగు వర్షన్‌ అంటూ రూమర్లు ఊపందుకున్నాయి.

రీమేక్‌ చేయడం తప్పు కాదు. కాని కొరటాల శివ వంటి స్టామినా ఉన్న డైరక్టర్‌.. ఖచ్చితంగా అఖిల్‌ కోసం కొత్త కథనే డెవలప్‌ చేస్తాడు కాని.. ఇలా రీమేకులు ఎందుకు ఎంచుకుంటాడు? వినడానికే కామెడీగా ఉంది బాసూ!!