Begin typing your search above and press return to search.

హలో.. ఈ ఫేకింగ్ రూమర్ విన్నారా?

By:  Tupaki Desk   |   4 Jan 2018 6:55 AM GMT
హలో.. ఈ ఫేకింగ్ రూమర్ విన్నారా?
X
అక్కినేని అఖిల్ రీలాంఛింగ్ మూవీ హలోకు డీసెంట్ మౌత్ టాక్ వచ్చినా.. వసూళ్లు మాత్రం ఆ స్థాయిలో లేవు. ఓవర్సీస్ లో పర్లేదని అనిపించుకున్న ఈ చిత్రం.. స్థానికంగా మాత్రం ఫెయిల్యూర్ గానే నిలిచింది. ఓవర్సీస్ లో నిర్మాత నాగార్జున సొంతగా రిలీజ్ చేసుకోగా.. హలో ఇప్పుడు మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరేందుకు చేరువ అయింది. అయితే.. ఇప్పుడు హలో చిత్రంపై కొత్తగా ఓ రూమర్ వచ్చింది.

సహజంగా రూమర్స్ కొత్తవే ఉంటాయి కానీ.. ఇది మాత్రం కొత్తగా ఉంది. అదేంటంటే.. యూఎస్ లో హలో చిత్రాన్ని మిలియన్ డాలర్స్ క్లబ్ లో ఎంటర్ చేసేందుకు.. ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లను సంప్రదించి.. కొంత మొత్తం వసూళ్లు ఎక్కువ నమోదు అయ్యేలా నాగార్జున ప్లాన్ చేశాడన్నది వాటి సారాంశం. ఈ రూమర్ నిజంగానే కొత్తగా ఉంది. ఫేక్ కలెక్షన్స్ అనే కాన్సెప్ట్ తరచూ వినిపిస్తూనే ఉంటుంది కానీ.. ఇది లోకల్ వసూళ్లకే పరిమితం. యూఎస్ లో సినిమా వసూళ్లపై రెన్ ట్రాక్ అమలవుతుంది. ఇలా టికెట్స్ కొంటూ ఉండగానే.. రిపోర్టులు వచ్చేస్తాయి. ఇప్పుడు కామ్ స్కోర్ అని పేరు మార్చుకున్నా.. ఇది విశ్వసనీయ వ్యవస్థే. ఇది వట్టి రూమర్ మాత్రమే నిజం కాదు అని అర్ధం అయ్యిపోయింది .. అఫ్ కోర్స్ ఇదంతా చేయకపోయినా హలో మూవీ మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ అవడం ఖాయమే. ఇప్పటికే 9.70 లక్షల డాలర్లు సాధించిన హలో.. మరో 30 వేల డాలర్లు వసూలు చేయడం కష్టమేమీ కాదులే!