Begin typing your search above and press return to search.
#RRR ఆలియాపై అవన్నీ గాలి వార్తలే
By: Tupaki Desk | 18 Jan 2020 7:17 AM GMT#RRR షూటింగ్ కి సంబంధించిన తాజా అప్ డేట్స్ అంతకంతకు వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. చరణ్.. తారక్ వంటి హీరోలు అప్పుడప్పుడు కొన్ని క్లూస్ ఇస్తూ ఫ్యాన్స్ లో ఎగ్జయిట్ మెంట్ పెంచుతున్నారు. ఇప్పటికే డబ్బైశాతం పూర్తయింది. రామ్ చరణ్- ఎన్టీఆర్ సహా ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్ సహా అరకు- వికారాబాద్ ఫారెస్ట్ లో పోరాట సన్నివేశాలను తెరక్కించారు. అడవి నేపథ్యంలోని సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్న ప్రచారం సాగుతోంది. ఇక చరణ్ కి జోడీగా .. బాలీవుడ్ అందాల కథానాయిక అలియాభట్ ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చరణ్-అలియా రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని ప్రచారం సాగింది.
సీతతో రామరాజు లవ్ సీన్స్.. భార్యాభర్తల అనుబంధానికి సంబంధించిన సీన్స్ ని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన ప్రత్యేక సెట్లలో తెరకెక్కించారని జోరుగా ప్రచారమైంది. అనంతరం ఆలియా బాలీవుడ్ లో కొత్త సినిమాకు కాల్షీట్లు కేటాయించినట్లు వార్తలొచ్చాయి. తాజాగా అవన్నీ గాలి వార్తలేనని తేలిపోయింది. చరణ్- అలియా మధ్య ఇప్పటివరకూ ఒక్క సన్నివేశం కూడా తెరకెక్కించనేలేదు. జనవరి 20 నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో అలియా పాల్గొంటుందని సమాచారం. చరణ్-ఎన్టీఆర్- సముదిరఖని సహా అలియా భట్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట. కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు.. లీడ్ రోల్స్ పై ముఖ్యమైన సన్నివేశాలు షూట్ చేయనున్నారుట.
అయితే ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ కు జంటగా ఎంపికైన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ జెన్నీఫర్ పాల్గొనే అవకాశం కనిపంచడం లేదు. ఈ షెడ్యూల్ అనంతరం తారక్-ఒలీవియా మధ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఈనెల 20 నుంచి మార్చి నెలాఖరు వరకూ తారక్-చరణ్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ తోనే బిజీగా ఉండనున్నారుట. వాళ్లపై షూటింగ్ పూర్తిగా వచ్చే నెలాఖరకు పూర్తవుతుందని తెలుస్తోంది. అనంతరం కొన్ని రోజుల ప్యాచ్ వర్క్ జరగనుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకధాటిగా జరుగుతున్నాయి. కాస్త పని స్లోగా ఉన్నా.. యథావిధిగా ప్రకటించిన తేదికే ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మాత్రం ఆపలేదని తెలుస్తోంది.