Begin typing your search above and press return to search.

బాలయ్య 105 గురించి భలే రూమర్

By:  Tupaki Desk   |   31 Dec 2018 8:53 AM GMT
బాలయ్య 105 గురించి భలే రూమర్
X
ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ ఇంకా విడుదల కాకుండానే తర్వాత సినిమాల గురించి ప్రచారం ఊపందుకుంది. దీని ప్రీ రిలీజ్ లోనే బోయపాటి శీను ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పాడు కాబట్టి దాని గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇందులో వయసులో వ్యత్యాసమున్న మూడు పాత్రలను బాలకృష్ణ చేయబోతున్నాడని ఇప్పటికే ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే ఇవాళ ఓ మీడియా వర్గంలో కొరటాల శివ బాలయ్య కోసం ఓ కథను రెడీ చేసాడని త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని ప్రచారం చేయడంతో నందమూరి అభిమానులు కొంత అయోమయానికి గురయ్యారు.

అదేంటి బోయపాటి శీనుది ఇంకా మొదలుపెట్టకుండానే ఇదేంటి అనుకుని కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే ఇదంతా ప్రస్తుతానికి గాసిప్ అనే చెప్పాలి. దీనికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. కొరటాల శివ చిరుకి లాక్ అయిపోయాడు. ఇప్పటికిప్పుడు కాదు కానీ మరో నెల రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన వచ్చేస్తుంది. బాలయ్యది ఒకవేళ ఉన్నా దానికి చాలా టైం పడుతుంది. పైగా మూడు పాత్రలు అని వచ్చిన న్యూస్ బోయపాటి మూవీ గురించే కాని కొరటాలది కాదు.

ఈ నేపధ్యంలో సరైన క్లారిటీ కోసం ఎదురు చూస్తున్న బాలయ్య ఫ్యాన్స్ కు ఇది సమాధానమని చెప్పొచ్చు. అయితే బోయపాటిది పూర్తయ్యాక బాలయ్యది ఏ దర్శకుడితో ఉండొచ్చు అనే ప్రశ్నకు బదులు మాత్రం ఇప్పట్లో దొరకదు. కథ సెట్ కాని కారణంగా వివి వినాయక్ తో ప్రాజెక్ట్ ని పెండింగ్ లో పెట్టిన బాలయ్య ఏడాదికి కనీసం రెండు కుదిరితే మూడు సినిమాలు చేసే ప్లానింగ్ లో ఉన్నాడు.