Begin typing your search above and press return to search.

అబ్బే.. సైరాకు సాయం చేయట్లేదు

By:  Tupaki Desk   |   18 Jan 2018 5:11 AM GMT
అబ్బే.. సైరాకు సాయం చేయట్లేదు
X
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా సైరా నరసింహారెడ్డి తెరకెక్కుతోంది. ఖైదీ నంబర్ 150తో తన సత్తా చాటిన చిరు.. మరుసటి మూవీ కోసం మాత్రం చారిత్రక కథాంశాన్ని ఎంచుకున్నారు. చాలాకాలంగా ఈ పాత్రపై మక్కువ ఉన్న మెగాస్టార్.. రామ్ చరణ్ తో ధృవ రూపొందించిన స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాడు.

అయితే.. తొలి షెడ్యూల్ తర్వాత హీరో-డైరెక్టర్ మధ్య కాసిన్ని విబేధాలు వచ్చాయనే టాక్ వినిపించింది. ఔట్ పుట్ పై మెగా టీం అంతగా సంతృప్తి చెందలేదని.. అందుకే ఈ మూవీని పర్యవేక్షించాల్సిందిగా.. చిరు ఫ్యామిలీ సన్నిహితుడు.. భారీ చిత్రాల నిర్మాత కం దర్శకుడు అయిన గుణశేఖర్ కు బాధ్యతలు అప్పగించారనే టాక్ వచ్చింది. కానీ.. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది. అసలు ఇప్పటివరకూ గుణశేఖర్ ను ఎవరూ అప్రోచ్ కాలేదట. ఏ విషయంలోనూ సంప్రదింపులు కూడా జరపలేదట. అలాంటప్పుడు సైరాకు సూపర్ వైజ్ చేయమని అడిగారని అనడం సరికాదని చెప్పుకుంటున్నారు.సైరా విషయంలో కెప్టెన్ పగ్గాలు అన్నీ సురేందర్ రెడ్డికేనని తేల్చేస్తున్నారు మేకర్స్.

పైగా ప్రస్తుతం గుణశేఖర్ బిజీగా ఉన్నాడు. తన కలల ప్రాజెక్టు అయిన హిరణ్యకశ్యపకు ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నాడు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేయాలనే పట్టుదలతో ఉన్నాడట ఈ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్. అయితే.. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఈ హిరణ్యకశ్యప ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభం అయినా సరే.. తను ఎంత బిజిగా ఉన్నా సరే.. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తానని చెప్పారట మెగాస్టార్.