Begin typing your search above and press return to search.
బోరింగ్ టాపిక్ అంటున్న రానా!
By: Tupaki Desk | 6 Aug 2019 12:10 PM GMTటాలీవుడ్ హీరో రానా దగ్గుబాటిపై ఏవో ఒక రూమర్లు రావడం చాలా కామన్ గా మారిపోయింది. ముఖ్యంగా రానా ఆరోగ్యం విషయంలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రానా అమెరికాకు వెళ్ళడమే ఆలస్యం.. రానాకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ కోసమే అక్కడకు వెళ్ళాడని అన్నారు. అయితే రానా అవన్నీ రూమర్లంటూ తోసిపుచ్చాడు. రానా ఎంత చెప్పినా రూమర్లు మాత్రం ఆగడం లేదు. దీంతో తాజాగా మరోసారి చెప్పాడు.
"నా ఆరోగ్యం గురించి చాలా రోజుల నుంచి ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.. నేను ఆరోగ్యంగా ఉన్నాను అని క్లారిటీ ఇస్తూ అలిసిపోయాను. అందుకే నాకు ఇదో బోరింగ్ టాపిక్ అయింది. నేను హైదరాబాద్ ను వదిలిపెట్టి ఎక్కడికైనా ప్రయాణమైతే చాలు.. వారు టెన్షన్ పడిపోతున్నారు. నామీద అందరూ చూపించే శ్రద్ధకు.. ప్రేమకు నేను ఋణపడి ఉంటాను" అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చాడు.
రానా హీరోగా నటించే సినిమాలతో పాటుగా స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ "మురళీధరన్ కథలో ఎన్నో మలుపులు.. సంఘర్షణ.. ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి" అని అభిప్రాయపడ్డాడు.