Begin typing your search above and press return to search.
పుకార్లు నమ్మొద్దు ‘ఆఫీసర్’
By: Tupaki Desk | 11 March 2018 2:09 PM GMTరామ్ గోపాల్ వర్మ పాతికేళ్ళ గ్యాప్ తర్వాత అక్కినేని నాగార్జున తో రూపొందిస్తున్న ఆఫీసర్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ మధ్యే విడుదల చేసిన ఫస్ట్ లుక్, స్టిల్స్ కి మిశ్రమ స్పందన వచ్చిన నేపద్యంలో తన ట్విట్టర్ ద్వారా వర్మ ఆన్ లొకేషన్ పిక్స్ షేర్ చేసుకుంటూ ఆసక్తి పెంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏ సినిమా అయినా గ్లామర్ తో కళకళలాడే నాగ్ ను ఇందులో బాగా సీరియస్ గా ఓల్డ్ లుక్ తో డీ గ్లామర్ చేయటం కొంత ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇక గత రెండు మూడు రోజులుగా ఆఫీసర్ బిజినెస్ గురించి డిజిటల్ హక్కుల అమ్మకాల గురించి రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఆఫీసర్ వీడియో స్ట్రీమింగ్ ను ఏకంగా 13 కోట్లకు కోనేసిందని, శాటిలైట్ ద్వారా మరో ఆరు కోట్ల దాకా వర్మ ప్రొడక్షన్ హౌస్ కంపెనీ జేబులో వచ్చి పడిందని వార్తలు వచ్చాయి.
వీటిని అధికారికంగా ఖండిస్తూ కంపెనీ సిఈఒ సుధీర్ చంద్ర అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు . ఆఫీసర్ సినిమా హక్కుల విషయంలో వస్తున్న పుకార్లను నమ్మకండని, ఇంకా ఎవరికి విక్రయించలేదని స్పష్టం చేసారు. కొన్ని మీడియా ఛానల్స్, ట్విట్టర్ మెసేజెస్ లో వస్తున్నవన్ని నిజం కాదని ఏదైనా తమను అడిగే నిర్ధారించుకోమని అందులో పేర్కొన్నారు. ఇంకా షూటింగ్ బాలన్స్ ఉందన్న సుధీర్ చంద్ర విడుదల మాత్రం మే 25 అని స్పష్టంగా పెర్కొనడంతో ఆ విషయంలో అనుమానాలు తొలగిపోయాయి.
సుధీర్ చంద్ర చెప్పాడని కాదు కాని ఆఫీసర్ సినిమాకు ఏ రకంగా చూసుకున్నా అమెజాన్ ప్రైమ్ అంత పెద్ద మొత్తం పెట్టడానికి వచ్చిందంటే అంత ఈజీగా నమ్మే విషయం కాదు. వర్మ ట్రాక్ రికార్డు ప్రకారం చూసుకున్నా ఆన్ లైన్ సంచలనాలు తప్ప నిజమైన బాక్స్ ఆఫీస్ సక్సెస్ సాధించి చాలా కాలం అయ్యింది. ఇక నాగ్ మార్కెట్ పరంగా చూసుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది రిస్కీ అమౌంటే. ఒకవేళ శాటిలైట్ తో కలిపి అంత మొత్తం అంటే నమ్మొచ్చు. మొత్తానికి ఆఫీసర్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసినట్టే.