Begin typing your search above and press return to search.

చిరు-నయన్.. అది రూమరే!!

By:  Tupaki Desk   |   30 Dec 2017 8:29 AM GMT
చిరు-నయన్.. అది రూమరే!!
X
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి. ఖైదీ నంబర్ 150 బ్లాక్ బస్టర్ తర్వాత.. తన మరుసటి చిత్రం చరిత్ర తిరగరాసేదిగా ఉండాలని భావించిన చిరు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సినిమాగా తీస్తున్నారు. రీసెంట్ గానే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం పై ఇప్పుడు రూమర్స్ ఎక్కువయ్యాయి.

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తప్పుకోవడం.. సినిమాటోగ్రాఫర్ ను మార్చడంతో.. హీరోయిన్ నయనతారపై కూడా రూమర్స్ వస్తున్నాయి. ఈమె డేట్స్ ను సైరా టీం వృథా చేసుకుందని.. ఇప్పటికే ఈమె కేటాయించిన డేట్స్ మురిగిపోయాయని రూమర్స్ ఎక్కువయ్యాయి. అయితే.. ఏడాదికి పైగా షూటింగ్ ప్లాన్ చేసుకున్న ఈ చిత్రానికి.. లీడ్ హీరోయిన్ నయనతార డేట్స్ ను ఫిబ్రవరి నుంచి తీసుకున్నారట. రెండు నెలలకు పైగా బల్క్ డేట్స్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో నయన్ తప్పుకుందనే వార్తలు అన్నీ రూమర్స్ మాత్రమే అని తెలుస్తోంది.

మెగాస్టార్ తో షూటింగ్ స్టార్ట్ చేసే విషయంలో నయన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెబుతున్నారు. పైగా ఈ మూవీ తర్వాత తెలుగులో కూడా తనకు సూపర్ స్టార్ రేంజ్ రావడం ఖాయం అని కాన్ఫిడెంట్ గా ఉందిట నయనతార.