Begin typing your search above and press return to search.
పవన్ ఈ రూమర్స్ నిజమేనా??
By: Tupaki Desk | 10 Jun 2015 5:30 PM GMTపవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో గబ్బర్‌సింగ్ -2 ఇటీవలే పూణే సమీపంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్కడే ఓ సెట్ వేసి అందులో తొలిషెడ్యూల్‌ని కూడా పూర్తి చేశారు. గుబురుగెడ్డం, పెరిగిన గిరజాలతో పవన్ షూటింగులో పాల్గొన్నాడని టాక్ బయటకొచ్చింది.
కాని ఇటీవలి కాలంలో దీనికి పూర్తి ఆపోజిట్‌గా, నెగెటివ్‌గా ఓ రూమర్ పుట్టుకొచ్చింది. గబ్బర్‌సింగ్-2 లాంఛనంగా ప్రారంభించినా ఆ సినిమా కథ విషయంలో పవన్ ఇంకా అసంతృప్తిగానే ఉన్నారని, గబ్బర్‌సింగ్ స్థాయిలో కథ కుదరలేదని అందుకే పవన్ షూటింగులో పాల్గొనలేదని ప్రచారం చేస్తున్నారు. రెండేళ్లుగా పవన్ నటించిన పూర్తి స్థాయి సినిమా ఏదీ రాలేదు. గబ్బర్‌సింగ్ తర్వాత ఆ స్థాయిలో అభిమానుల్ని సంతృప్తి పరిచే పూర్తి స్థాయి నవరసాలున్న సినిమాలో పవన్ నటించలేదు. గోపాల గోపాల చిత్రంలో నటించినా అది కేవలం పరిమిత పరిధి ఉన్న క్యారెక్టర్ మాత్రమే. అందువల్ల అభిమానులు చాలా సీరియస్‌గా ఉన్నారు. అందుకే వారిలో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకే ఈ ఓపెనింగ్ డ్రామా ఆడారని అంటున్నారు.
అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత? అబద్ధం ఎంత? గిట్టనివారి ప్రాపకం ఎంత? అనేది తెలియాలంటే పవన్ నోరు మెదపాల్సిందే. అసలు ఏం జరుగుతోందో వాస్తవాన్ని దర్శకుడు బాబి వెల్లడించినా బావుంటుంది.