Begin typing your search above and press return to search.
సినిమాయే రాలేదు.. గాసిప్పులేంటో..
By: Tupaki Desk | 8 Feb 2016 11:30 AM GMTఒక్కోసారి అంతే.. ఏదైనా ఒక సినిమాలో కాస్త హిట్టు కళ కనిపించిందంటే చాలు.. దానిని ఎవరో రీమేక్ చేస్తున్నారు అంటూ తెగ గాసిప్పులు వినిపిస్తుంటాయి. శ్రీమంతుడు రీమేక్ బాలీవుడోళ్ళు చేస్తున్నారు అన్నారు.. ఇంకా అది షురూయే కాలేదు. డిక్టేటర్ రిలీజ్ కు ముందు అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నాడు అని చెప్పారు. తీరా సినిమా రిజల్టు చూశాక.. ఆ రూమర్ ఆగిపోయింది. ఇప్పుడు రివర్సులో పవన్ కళ్యాణ్ మీద ఒక రూమర్ షురూ అయ్యింది.
మొన్ననే 'తెరి' సినిమా టీజర్ రిలీజైంది. ఇప్పటికే హిందీలో వచ్చిన దబాంగ్ సినిమాను పవన్ రీమేక్ చేశాడు కాబట్టి.. ఇప్పుడు విజయ్ హీరోగా వస్తున్న తెరి సినిమాను కూడా ఇదే విధంగా రీమేక్ చేయడానికి పవన్ చూస్తున్నాడు అంటూ తెగ గాసిప్పులు పుట్టేస్తున్నాయి. అసలు టీజర్ చూసేసి పవన్ సినిమాను రీమేక్ చేయాలని అనుకోవడమేంటి? సిల్లీగా ఉంది. పైగా ఇలాగ టీజర్లు ఏ రేంజులో హిట్టయినా కూడా సినిమా హిట్టవుతుందనే గ్యారెంటీ ఈరోజుల్లో మాత్రం లేదు. సో.. సినిమా వచ్చాకే పవన్ డెసిషన్ తీసుకుంటాడని సన్నిహితులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి తెరి టీజర్ చూశాడో లేదో తెలియదు కాని.. పవన్ మాత్రం కేరళ వాటర్ ఫాల్స్ దగ్గర కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ చేస్తున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను త్వరగా పూర్తి చేసి ఏప్రియల్ 8న రిలీజ్ చేయాలనే పనిలో ఉన్నాడు. ఇకపోతే బ్యాక్ టు బ్యాక్ మనోడు ఇన్నేసి సార్లు పోలీస్ క్యారెక్టర్లు చేస్తాడని అస్సలు అనుకోలేం.