Begin typing your search above and press return to search.
పవన్ ఇంట్లో ఏ విషాదమూ లేదు
By: Tupaki Desk | 9 March 2018 10:32 AM GMTఎక్కడ నుంచి పుడతాయో కానీ... నిప్పు లేకుండా పొగ రేగిపోతుంది. రూమర్స్ అంతే... ఏంజరుగకుండానే...ఏదో జరిగిందంటూ వార్తలు హల్ చల్ చేస్తాయి. వాటిని అసలు పుట్టించెందెవరో తెలియదు కానీ... సోషల్ మాధ్యమాల్లో వైరల్‌గా మారిపోతాయి. అందులోనూ సెలెబ్రిటీలకు సంబంధించిన వార్త అయితే మరి చెప్పక్కర్లేదు... తెగ షేర్లు అయిపోతూ... ప్రపంచమంతా చుట్టేస్తుంది. సరిగ్గా అలాగే పవన్ కళ్యాణ్ ఇంట్లో విషాదం అంటూ ఓ రూమర్ సంచలనమై పోయింది.
పవన్ మూడో భార్య అన్నా లెజెనోవా. ఆమె తల్లి మరణించిందనీ.. పవన్ కుటుంబం విషాదంలో ఉందని రూమర్ వచ్చింది. దానిపై కొందరు యూట్యూబ్ లో రేణుదేశాయ్ స్పందించిందంటూ వార్తలు కూడా క్రియేట్ చేశారు. ఇవి పవన్ కళ్యాణ్ వరకు చేరాయి. అసలే రాజకీయ యాత్రలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఈ వార్తలు తలనొప్పిగా అనిపించాయి. పవన్ మేనేజర్ వెంటనే స్పందించాడు. ఆ వార్తలన్నీ అవాస్తవమని... ఆయన మీడియాకు తెలియజేశాడు. పవన్ కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పాడు. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకసారి నిజమా కాదో తెలుసుకున్నాకే పబ్లిష్ చేయాలని కోరారు.
ఈ విషయంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఏకంగా రేణు దేశాయ్ స్పందన అని కూడా రాశారు. ఆమె సంతాపం వ్యక్తం చేశారని ప్రచారం చేశారు. ఈ రేంజ్‌లో అబద్ధాన్ని సృష్టించి ప్రచారం చేసుకోవడం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వ్యూస్ కోసం ఇలా సెలెబ్రిటీలతో ఆటలాడుకోవడం కూడా కరెక్ట్ కాదేమో.