Begin typing your search above and press return to search.
చిరంజీవి రెస్పాండ్ అవ్వడం ఏంట్రా సామీ??
By: Tupaki Desk | 11 April 2018 4:33 AM GMTహహహహ.. విషయమేంటో చెప్పకుండా ముందే ఈ వెక్కిరింతల నవ్వులేంటా అనుకోవచ్చు కానీ.. కొన్ని నవ్వు తెప్పించే విషయాలను చెప్పేందుకు ముందు.. చెప్పేవాళ్లకు కూడా నవ్వుకోక తప్పని పరిస్థితి. ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఓ రూమర్ వింటే.. ఇలాగే పగలబడి నవ్వుకోవాల్సి వస్తోంది.
ఒకప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి టాలీవుడ్ లోనే మాటలు వినిపించేవి. ఇప్పుడు బాహుబలి తర్వాత గురించి దేశవ్యాప్తంగా డిస్కషన్స్ నడిచిపోతున్నాయి. అనుష్కతో ప్రభాస్ పెళ్లి అనేది పాత కబురు కాబట్టి.. ఓ బాలీవుడ్ మీడియా కొత్త పుకారు సృష్టించింది. అదేంటంటే.. మెగా బ్రదర్ నాగబాబు తనయ నీహారికతో ప్రభాస్ పెళ్లి గురించి మాటలు జరుగుతున్నాయని వార్త ఒకటి వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని.. తెలుగులో కొన్ని వెబ్ సైట్లు తమ రచనా పైత్య ప్రకోపాన్ని మరింతగా చూపించేయడం మొదలుపెట్టాయి.
నీహారికతో ప్రభాస్ పెళ్లి విషయంపై చిరంజీవి రియాక్ట్ అయ్యారట. ఆలూ చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న తరహాగా తయారైంది ఈ వ్యవహారం. ఎవరో ఎక్కడో ఏదో వాగితే.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ రియాక్ట్ అయిపోయారట. చిరంజీవి పేరుతో మిక్స్ చేసి పుకార్లు పుట్టిస్తే వాటికి క్లిక్స్ ఎక్కువగానే వచ్చేస్తాయని వాళ్ల పేరాశ. అందుకే ఆయా యుట్యూబ్ ఛానల్స్ అండ్ వెబ్ సైట్స్ ఇలా సొంత క్రియేటివిటీ ప్రదర్శించేసి.. చెత్త కంటెంట్ తో జనాలను తప్పుదోవ పట్టించేస్తున్నారు.