Begin typing your search above and press return to search.

కబాలి.. రజినీ డబ్బింగ్ పై రూమర్లు!!

By:  Tupaki Desk   |   15 July 2016 7:30 AM GMT
కబాలి.. రజినీ డబ్బింగ్ పై రూమర్లు!!
X
సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కబాలి.. ఈ నెల 22న రిలీజ్ అంటూ నిర్మాతలు ఇప్పటికే చెప్పేశారు. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయిపోవడంతో.. ఇక రిలీజ్ విషయంలో సందేహాలు లేవంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇప్పటికి ఓ అర డజన్ సార్లు పోస్ట్ పోన్ చేసి.. చివరకు ఈ డేట్ కి ఫిక్స్ అయింది యూనిట్.

కానీ ఇప్పుడు కోలీవుడ్ టాలీవుడ్ లలో ఓ రూమర్ నడుస్తోంది. కబాలి మూవీ వచ్చే వారం విడుదల కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణంగా రజినీకాంత్ ఇంకా డబ్బింగ్ చెప్పలేదనే మాట వినిపిస్తోంది. మరి రజినీ డబ్బింగ్ లేకుండా సెన్సార్ ఎలా కంప్లీట్ అవుతుందంటే.. నిజానికి ఇందుకో రూట్ ఉంది. షూటింగ్ స్పాట్ నుంచి వాయిస్ రికార్డ్ చేసిన కాపీతో కూడా సెన్సార్ చేయించుకోవచ్చు. ఫైనల్ వెర్షన్ లో ల్యాబ్ రికార్డింగ్ ఆడియోని మిక్స్ చేస్తారన్న మాట.

ఇప్పుడు కబాలిపై కన్ఫ్యూజన్ తొలగించడం కోసం.. నిర్మాతలు ముందే సెన్సార్ ఫార్మాట్ పూర్తి చేశారని.. తర్వాత రజినీ డబ్బింగ్ చేయిద్దామని అనుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. రజినీ డబ్బింగ్ చెప్పడానికి 2 రోజుల సమయం అవసరం కాగా.. ఇప్పటికీ ఆయన హెల్త్ బాగోలేకపోవడంతో.. 22న విడుదల కష్టమే అనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరి రజినీ డబ్బింగ్ పై రూమర్స్ ని నిర్మాతలే క్లియర్ చేయాలి.