Begin typing your search above and press return to search.

ఎన్‌ టీఆర్ లో రానా.. కొత్త రూమర్

By:  Tupaki Desk   |   5 April 2018 5:01 AM GMT
ఎన్‌ టీఆర్ లో రానా.. కొత్త రూమర్
X
దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ఎన్టీఆర్ అనే టైటిల్ పై బయోపిక్ గా తెరకెక్కిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. తండ్రి పాత్రలో ఆయనే నటిస్తుండగా.. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రీసెంట్ గా గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. అయితే.. ఈ సినిమాలో నటించే ఇతర పాత్రధారులు ఎవరు అనే విషయంపై మాత్రం ఎవరూ స్పష్టత ఇవ్వలేదు.

కానీ రూమర్లు మాత్రం తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ హిస్టరీ అంటే అందులో నారా చంద్రబాబు నాయుడు రోల్ కూడా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇప్పుడీ పాత్రను దగ్గుబాటి రానా చేయించనున్నారనే వార్తలు వస్తున్నాయి. గతేడాది నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో పొలిటికల్ లీడర్ గా మెప్పించిన రానా.. చంద్రబాబు నాయుడు రోల్ కు సరిగ్గా సరిపోతాడని మేకర్స్ భావిస్తున్నారంటూ టాక్ బయలుదేరింది. గతంలో ఇదే పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి.

ఇప్పుడు రాజశేఖర్ కు బదులుగా యంగ్ హీరో రానా అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. నిజానికి ఈ రెండిటిలో ఏది వాస్తవం అనే విషయం చెప్పడం కష్టం. రెండూ నిజం కాకపోవచ్చు కూడా. కానీ.. ఎన్టీఆర్ జీవితం అంటే ఓ చరిత్ర. ఆరు సినిమాల కథను ఒక చిత్రంగా రూపొందిస్తున్నామని దర్శకుడు తేజ చెప్పాడు కాబట్టి.. మిగిలిన రోల్స్ ఏవైనా సరే అతిథి పాత్రల మాదిరిగానే ఉండొచ్చు.