Begin typing your search above and press return to search.

కియ‌రా- సిధ్ జంట‌లా త‌మ‌న్నా-విజ‌య్..!

By:  Tupaki Desk   |   17 Jan 2023 7:58 AM GMT
కియ‌రా- సిధ్ జంట‌లా త‌మ‌న్నా-విజ‌య్..!
X
2023 న్యూ ఇయర్ వేడుకలో తమన్నా భాటియా - విజయ్ వర్మ ముద్దులు పెట్టుకున్న వీడియో ఆన్ లైన్ లో వైరల్ అయిన కొద్ది వారాల తర్వాత ఈ జంట రొమాన్స్ పై ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగాయి.

మ‌రోసారి ఇప్పుడు ఈ జోడీ ఎంతో చ‌నువుగా కనిపించడం కెమెరా కంట ప‌డింది. తమన్నా- విజయ్ జంట‌ బాంద్రా లో కలిసి షికార్ చేస్తూ కనిపించారు.ఇద్దరూ కలిసి కెమెరాలకు పోజ్ ఇవ్వ‌కుండా త‌ప్పించుకోజూసినా కానీ ఆ ఇద్ద‌రినీ కెమెరామెన్లు వ‌దిలి పెట్ట‌లేదు. ఏదో ఒక ర‌కంగా ఈ జంట‌ను త‌మ క్యామ్ లెన్స్ లో లాక్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఇంత‌కుముందు కియ‌రా- సిధ్ జంట దాగుడు మూత‌ల ఆట‌ త‌ర‌హాలోనే త‌మ‌న్నా-విజ‌య్ వ‌ర్మ జంట దొరికిపోయార‌న్న గుస‌గుస ఇప్పుడు ముంబై బాంద్రాలో వైర‌ల్ గా మారుతోంది.

ఈ జంట కొత్త సంవత్సర వేడుక‌ల వేళ‌ గోవాలో సంద‌డి చేసిన‌ త‌ర్వాత‌.. ముంబై నగరానికి కలిసి వచ్చిన వారం అనంత‌రం మ‌రోసారి బ‌హిరంగంగా క‌లిసి క‌నిపించారు. అయితే విజయ్- తమన్నాను తన కారు వద్దకు వ‌స్తుండ‌గా విమానాశ్రయం వద్ద అత‌డు వేచి ఉండ‌డం క‌నిపించింద‌ని చెబుతున్నారు.

తమన్నా - విజయ్ ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ కౌగిలించుకోవడం వంటి వీడియో ఆన్ లైన్ లో వైరల్ కావడంతో నెటిజన్లు డేటింగ్ చేస్తున్నారని బ‌లంగా నమ్ముతున్నారు. వారి ముఖాలు ఆ వీడియోలో కనిపించనప్పటికీ నెటిజనులు ఈ జోడీ దుస్తులను పోల్చి చూసాక ఇది నిజ‌మేన‌ని నిర్ధారించుకున్నారు.

ఈ జంట‌ లింక‌ప్ క‌థ‌నాలు అటుంచితే.. కెరీర్ ప‌రంగా ఇద్ద‌రి క‌నెక్ష‌న్ ఎక్క‌డ అన్న‌ది ఆరా తీస్తే...లస్ట్ స్టోరీస్ 2 లో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. తమన్నా చివరిగా నెట్ ఫ్లిక్స్ చిత్రం 'ప్లాన్ ఎ ప్లాన్ బి'లో రితీష్ దేశ్‌ముఖ్ సరసన నటించింది. ఇటీవల మధుర్ భండార్కర్ 'బ‌బ్లీ బౌన్సర్'లోను త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.

విజయ్ వర్మ 'డార్లింగ్స్'లో అద్భుత నటనతో ఆక‌ట్టుకున్నాడు. సుజోయ్ ఘోష్ తదుపరి చిత్రంలో కరీనా కపూర్ తో కలిసి న‌టిస్తున్నారు. వ‌రుస సినిమాల‌తో బిజీ ఆర్టిస్టుగా కొన‌సాగుతున్న విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా స్నేహం అన్ని ర‌కాల సందేహాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ముంబై బ్యూటీ త‌మ‌న్నాపై గ‌తంలో ఎఫైర్ ల‌కు సంబంధించి మీడియా క‌థ‌నాలు వెలువ‌డినా కానీ ఇంత బ‌ల‌మైన పుకార్లు మాత్రం అప్ప‌ట్లో లేవ్!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.