Begin typing your search above and press return to search.
పూరి కి రమ్యకృష్ణ 50 శాతం ఇస్మార్ట్ డిస్కౌంట్
By: Tupaki Desk | 23 Dec 2019 5:15 AM GMTఫిలిం ఇండస్ట్రీ లో రెమ్యూనరేషన్లు అనేది ఒక సంక్లిష్టమైన అంశం. డిమాండ్ ఉంటేనే పారితోషికం ఇస్తారు. సక్సెస్ ఉంటేనే డిమాండ్ ఉంటుంది. సక్సెస్ లేకపోతే ఎవరికీ డిమాండ్ ఉండదు. ఇక ఎడ్వాన్స్ మాత్రమే ఇచ్చి మిగతా పారితోషికం ఎగ్గొట్టే జనాలు కూడా ఉంటారు. చట్టాలు న్యాయాలు ధర్మాలు ఉన్నాయి కదా.. అలా ఎలా జరుగుతుంది?.. అని అడిగితే దానికి ఒకటే సమాధానం.. నిర్మాతే సినిమా ఫలితం తో పూర్తిగా మునిగిపోతే ఇక పారితోషికాల ప్రస్తావన ఎక్కడుంటుంది? అందుకే ఎక్కువ మంది సీనియర్ నటీనటులు తమ పారితోషికాల విషయం లో నిక్కచ్చి గా ఉంటారనే టాక్ ఉంది. కానీ రీసెంట్ గా రమ్యకృష్ణ మాత్రం ఈమధ్య తన రెమ్యూనరేషన్ ను సడలించి హాట్ టాపిక్ అయింది.
'బాహుబలి' విజయం తర్వాత రమ్యకృష్ణ కు డిమాండ్ పెరిగింది. ఆ సినిమాలో శివగామి గా రమ్యకృష్ణ జీవించడం తో చాలామంది ఫిలిం మేకర్ల కు రమ్యకృష్ణ ఫస్ట్ ఛాయిస్ గా మారింది. ప్రస్తుతం రమ్యకృష్ణ ఒక రోజు కాల్ షీట్ కు 7-10 లక్షలు తీసుకుంటున్నారట. ఈ లెక్కన ఒక సినిమాకు 10 - 15 రోజుల కాల్ షీట్స్ ఇస్తే దాదాపుగా కోటి రూపాయల పారితోషికం పుచ్చుకుంటారు. కానీ పూరి జగన్నాధ్ సినిమాలకు మాత్రం అందులో సగమే తీసుకుంటున్నారట. పూరి నిర్మాణం లో తెరకెక్కుతున్న 'రొమాంటిక్' లో రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పూరి - విజయ్ దేవరకొండ సినిమా 'ఫైటర్' లో కూడా ఒక ముఖ్య పాత్ర లో నటిస్తారట. ఈ రెండు సినిమాలకు రెగ్యులర్ గా తీసుకునే రెమ్యూనరేషన్ లో సగమే తీసుకుంటున్నారని సమాచారం. తక్కువ పారితోషికం తీసుకోవడమే కాదు.. ఎక్కువగా 15-20 రోజుల కాల్ షీట్స్ కూడా ఇచ్చారట.
హీరో పాత్రలే కాదు... హీరోకు తల్లిదండ్రుల పాత్రలు కూడా బలంగా డిజైన్ చెయ్యడం లో పూరి స్పెషలిస్టు. రమ్యకృష్ణ కోసం పూరి డిజైన్ చేసిన పాత్రలు స్ట్రాంగ్ గా ఉన్నాయని.. అవి తనకు మంచి పేరు తీసుకొస్తాయని అనుకుంటోందట. అందుకే మహిష్మతి చట్టం ప్రకారం శివగామి ఇలా డిస్కౌంట్ ఇచ్చి ఉండొచ్చని ఫిలిం నగర్లో చెవులు కొరుక్కుంటున్నారు.