Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: రన్
By: Tupaki Desk | 23 March 2016 10:07 AM GMTచిత్రం : రన్
నటీనటులు: సందీప్ కిషన్ - అనీషా ఆంబ్రోస్ - బాబీ సింహా - మహత్ రాఘవేంద్ర - పోసాని కృష్ణమురళి - బ్రహ్మాజీ - కాశీవిశ్వనాథ్ - ప్రవీణ్ - మధునందన్ తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: రాజశేఖర్
మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి - కిషోర్ గరికపాటి - అజయ్ సుంకర
కథ - స్క్రీన్ ప్లే : అల్ఫాన్సో పుతెరిన్
దర్శకత్వం : అని కొన్నెగంటి
అసాధ్యుడు.. మిస్టర్ నూకయ్య సినిమాలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్న యువ దర్శకుడు అని కొన్నెగంటి ఈసారి.. ఓ రీమేక్ ను నమ్ముకున్నాడు. తమిళ హిట్ మూవీ ‘నేరం’ను ‘రన్’ పేరుతో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కించాడు. ‘ప్రేమమ్’ సినిమాతో సౌత్ ఇండియాను ఉర్రూతలూగించిన అల్ఫాన్సో పుతెరిన్ తొలి సినిమా ఇదే కావడం విశేషం. అనిల్ సుంకర నిర్మించిన ‘రన్’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
సంజయ్ అలియాస్ సంజు (సందీప్ కిషన్) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అతడికి అమూల్య అలియాస్ అమ్ము (అనీషా ఆంబ్రోస్) అనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఐతే కొన్ని కారణాల వల్ల అనుకోకుండా సంజు ఉద్యోగం కోల్పోతాడు. అదే టైంలో అతడి అక్క పెళ్లి చేయాల్సి వస్తుంది. దీంతో అత్యంత క్రూరుడైన వడ్డీ రాజా (బాబీ సింహా) దగ్గర అప్పు తీసుకుంటాడు. ఐతే సంజు ఆ తర్వాత చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. వడ్డీ రాజాకు డబ్బు తిరిగివ్వలేని పరిస్థితి తలెత్తుతుంది. మరోవైపు అమ్ము తండ్రి వీళ్ల ప్రేమకు అడ్డం పడతాడు. ఇంకోవైపు సంజు బావ ఇతణ్ని కట్నం డబ్బులు అడుగుతాడు. ఇలా సమస్యలన్నీ ఒకేసారి అతణ్ని చుట్టుముడుతాయి. సంజు ఆ సమస్యలన్నింటి నుంచి ఎలా బయటపడ్డాడన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
తెలుగు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చాలా తక్కువ. గతంలో ఒకటీ అరా సినిమాలు ఆ తరహాలో తెరకెక్కినా పెద్దగా ఆదరణ పొందలేదు. ఐతే ఈ మధ్య మన ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. ‘భలే మంచి రోజు’ లాంటి కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ ను బాగానే ఆదరించారు. రన్ కూడా ఈ కోవలోని సినమానే. బ్యాడ్ టైం వెనుకే గుడ్ టైం వస్తుందనే కాన్సెప్ట్ ను ఆసక్తికర కథనం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే సినిమా ఇది. కాన్సెప్ట్ పరంగా ఇది మంచి ప్రయత్నమే. స్క్రీన్ ప్లే కూడా భిన్నంగా అనిపిస్తుంది. ఓ కొత్త తరహా సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది. ఐతే సినిమా అనుకున్నంత సీరియస్ గా సాగకపోవడం.. పాత్రల్లో ఇంటెన్సిటీ లేకపోవడం.. ప్రేక్షకులు కోరుకున్న స్థాయిలో థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకపోవడంతో ‘రన్’ జస్ట్ ఓకే అనిపిస్తుంది కానీ.. ప్రత్యేకమైన ఫీలింగ్ మాత్రం ఇవ్వదు.
ప్రథమార్ధంలో హీరోను ఒక్కో సమస్య చుట్టుముట్టడం నేపథ్యంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయానికి పెద్దగా సమయం తీసుకోలేదు. హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని కొన్ని మాటల్లో.. ఓ పాటలో ముగించేశారు. సందీప్ - అనీషాల మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాని నేపథ్యంలో ప్రేమకథను తక్కువ నిడివికే పరిమితం చేయడం కూడా మంచిదే అయింది. వడ్డీ రాజా పాత్ర ఆరంభం నుంచే ఆసక్తి రేపుతుంది. ప్రథమార్ధం ముగిసేసరికి హీరో సమస్యల్లో పీకల్లోతు మునిగిపోయే స్థితికి చేరుకుంటాడు. ప్రథమార్ధంలో వడ్డీ రాజాగా బాబీ సింహా.. బ్రహ్మాజీ - కాశీ విశ్వనాథ్ క్యారెక్టర్లు వినోదం పంచుతాయి. పద్మావతి పాత్రలో బ్రహ్మాజీ క్యారెక్టర్ పంచే వినోదం సినిమాలో పెద్ద రిలీఫ్.
ద్వితీయార్ధంలో హీరో సమస్యలు పరిష్కారం అయ్యే దగ్గర్నుంచి కథనం ఊపందుకుంటుంది. సినిమా కాన్సెప్ట్ లో ఉన్న ప్రత్యేకత కూడా సెకండాఫ్ లోనే తెలిసొస్తుంది. క్లైమాక్స్ లో కోయిన్సిడెన్స్ లు మరీ ఎక్కువైపోవడం.. కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగడం.. ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరోయిన్ గురించి హీరో కానీ.. మానిక్ పాత్రధారి కానీ అస్సలు పట్టించుకోకుండా వాళ్ల పనిలో వాళ్లుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఐతే వడ్డీ రాజా పాత్రను ముగించిన తీరు.. దానికి సంబంధించిన ట్విస్టు బాగున్నాయి. ద్వితీయార్ధంలో బ్రహ్మాజీ - బాబీ సింహాలతో పాటు పోసాని బాగా ఎంటర్ టైన్ చేశాడు. సెకండాఫ్ లో హీరోయిన్ పాత్రను పూర్తిగా పక్కన పెట్టేయగా.. హీరో క్యారెక్టర్ కూడా అంతగా ఎలివేట్ అవ్వదు.
దర్శకుడు అని కొన్నెగంటి మాతృకకు ఎంతగా ఎంతగా కట్టబడ్డాడంటే స్క్రీన్ ప్లే క్రెడిట్ కూడా అల్ఫాన్సో పుతెరిన్ కే ఇచ్చాడు. హీరో ఉద్యోగం ఎలా పోయిందనే విషయాన్ని కార్టూన్ బొమ్మలతో చూపించడం మొదలు.. మహత్ రాఘవేంద్ర పాత్ర బ్లూ కలర్ షర్టే వేసుకోవడం వరకు యాజిటీజ్ ‘నేరం’నే దించాడు. అందుకేనేమో మరి కథతో పాటు స్క్రీన్ ప్లే క్రెడిట్ కూడా అల్ఫాన్సో పుతెరిన్ కే ఇచ్చేశాడు. ఐతే ‘నేరం’ మ్యాజిక్ ను మాత్రం అనుకున్న స్థాయిలో రీక్రియేట్ చేయలేకపోయాడు. తమిళంలో ఉన్న ఫీల్ తెలుగులో కనిపించలేదు. నిడివి తక్కువుండటం ప్లస్సే కానీ.. మరీ గంటా 45 నిమిషాలకే పరిమితమైపోవడంతో ఓ షార్ట్ ఫిలిం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మూవీ కాన్సెప్ట్ కూడా షార్ట్ ఫిల్మ్స్ తరహాలోనే ఉండటం విశేషం. ఈ తరహా కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ అర్బన్ ఆడియన్స్ కు బాగానే అనిపిస్తాయి కానీ.. మాస్ కు ఎక్కకపోవచ్చు.
నటీనటులు:
సందీప్ కిషన్ బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రలో బాగా చేశాడు. సంజు పాత్రను ఈజీగా చేసుకెళ్లిపోయాడు. డబ్బులు పోయిన నిస్సహాయ స్థితిలో అతడి హావభావాలు బాగున్నాయి. హీరోయిన్ తండ్రితో తెగేసి మాట్లాడే సన్నివేశంలోనూ బాగా నటించాడు. ఐతే క్లైమాక్స్ లో మాత్రం సందీప్ చేయడానికి ఏమీ లేకపోయింది. అనీషా ఆంబ్రోస్ పర్వాలేదనిపిస్తుంది. ప్రత్యేకమైన ముద్రేమీ వేయదు. అందం.. అభినయం రెండింట్లోనూ సోసోగా అనిపిస్తాయి. వడ్డీ రాజాగా బాబీ సింహా అదరగొట్టాడు. మహత్ రాఘవేంద్ర పెద్దగా చేసిందేమీ లేదు. పోసాని - బ్రహ్మాజీ నవ్వించారు. హీరో ఫ్రెండు పాత్రలో ప్రవీణ్ బాగా చేశాడు. కాశీ విశ్వనాథ్ పర్వాలేదు.
సాంకేతిక వర్గం:
సాయికార్తీక్ సంగీతం పర్వాలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే పాట బాగుంది. క్లైమాక్స్ లో వచ్చే పాట తమిళం నుంచి తీసుకున్నది. తెలుగులో అంత ఎఫెక్టివ్ గా లేదు. డబ్బులు కొట్టేసిన దొంగను తరుముతూ హీరో టెన్షన్ లో పరుగెడుతుంటే అప్పుడు బ్యాగ్రౌండ్ లో ఇన్ స్పిరేషనల్ సాంగ్ పెట్టడంలో ఔచిత్యమేంటో దర్శకుడు - మ్యూజిక్ డైరెక్టర్లకే తెలియాలి. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. తమిళ వెర్షన్ లో సినిమాటోగ్రఫీ హైలైట్ అయింది. సినిమా మూడ్ ను బాగా క్యారీ చేసింది. ఐతే తెలుగులో రాజశేఖర్ రెగ్యులర్ సినిమాల తరహాలోనే ఔట్ పుట్ ఇచ్చాడు. నిర్మాణ విలువలు పర్వాలేదు. చాలా తక్కువ ఖర్చుతో పరిమితమైన లొకేషన్లలో సినిమా తీశారు. ప్రసన్న కుమార్ మాటలు బాగున్నాయి. హీరోయిన్ తండ్రికి - హీరోకు మధ్య వచ్చే సన్నివేశంలో సంభాషణలు బాగున్నాయి. అనిల్ కృష్ణ దర్శకుడిగా తన ముద్రంటూ ఏమీ వేయలేదు. తమిళ సినిమానే యతాతథంగా తెలుగులో తీసి పెట్టాడు.
చివరగా- రన్.. షార్ట్ ఫిల్మ్ లాంటి సినిమా.
రేటింగ్- 2.75/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre