Begin typing your search above and press return to search.

‘రన్’ గురించి ఓ షాకింగ్ న్యూస్

By:  Tupaki Desk   |   22 March 2016 8:08 AM GMT
‘రన్’ గురించి ఓ షాకింగ్ న్యూస్
X
టాలీవుడ్లో నెలన్నరగా సాగుతున్న గడ్డు రోజులకు ఇక తెరపడినట్లే. ముందుగా ఇంటర్ విద్యార్థులు.. ఆ తర్వాత టెన్త్ స్టూడెంట్స్ .. ఆ పై మిగతా వాళ్లు.. సినిమాల వైపు కదలబోతున్నారు. మిగతా యూత్ ఎలాగూ ఉంటారు. ఇక వసూళ్లకు ఢోకా ఏమీ ఉండదు. ఈ బుధవారం నుంచి సమ్మర్ సందడికి తెరలేవబోతోంది. ముందుగా సందీప్ కిషన్ సినిమా ‘రన్’ కొబ్బరికాయ కొట్టబోతోంది. గత ఏడాది ‘టైగర్’తో ఓ మోస్తరు సక్సెస్ కొట్టిన సందీప్ కిషన్.. ‘రన్’ మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు. అసాధ్యుడు - మిస్టర్ నూకయ్య సినిమాల ఫేమ్ అని కన్నెగంటి దర్శకత్వం వహించిన సినిమా ఇది. సందీప్ సరసన అనీషా ఆంబ్రోస్ కథానాయికగా నటించింది.

రన్.. ‘నేరమ్’ అనే తమిళ/మలయాళ ద్విభాషా చిత్రానికి రీమేక్. ‘ప్రేమమ్’ దర్శకుడు అల్ఫాన్సో పుతెరిన్ తొలి సినిమా ఇది. బ్యాడ్ టైమ్ వెంటే.. గుడ్ టైమ్ కూడా వస్తుంది అనే కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కిన భిన్నమైన సినిమా ఇది. తమిళ - మలయాళ భాషల్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. తమిళంలో దీని నిడివి కేవలం గంటా 45 నిమిషాలు మాత్రమే. అంటే ‘నాన్నకు ప్రేమతో’ ఇంటర్వెల్ ముగించుకుని రెండో అర్ధానికి కూర్చునే సమయానికి ‘నేరమ్’ సినిమా ముగిసిపోతుందన్నమాట. తెలుగులో కూడా దాదాపుగా ఇంతే నిడివి ఉంటుందని అంటున్నారు. డైరెక్టర్ అని.. తెలుగులో పెద్దగా మార్పులేమీ చేయకుండా.. అడిషన్స్ ఏమీ లేకుండా.. ఒరిజినల్ కు కట్టుబడే సినిమా తీశాడట. కాబట్టి టాలీవుడ్లో వచ్చిన షార్టెస్ట్ మూవీస్ లో ఇది ఒకటి అయ్యే అవకాశముంది.