Begin typing your search above and press return to search.

చెర్రీని వాడినా చరిత్ర మారలేదు

By:  Tupaki Desk   |   24 March 2016 5:30 PM GMT
చెర్రీని వాడినా చరిత్ర మారలేదు
X
ఈ హోలీకి రన్ మూవీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందునుంచి ఈ రన్ చిత్రానికి డిఫరెంట్ గా ప్రచారం చేయడంతో.. ఆసక్తి పెరిగింది. మరోవైపు ఊపిరి మూవీ వస్తుండడంతో... దానికి రెండు రోజుల ముందే రిలీజ్ చేయడంతో.. రన్ పై అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీం అనిపించింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన రన్ చిత్రానికి.. అని కన్నెగంటి దర్శకుడు. గతంలో అసాధ్యుడు - మిస్టర్ నూకయ్య వంటి ఫ్లాప్ చిత్రాలను తీసిన అనుభవం బాగానే ఉంది.

ఈసారి రీమేక్ మూవీ కావడంతో.. కాన్సెప్ట్ బేస్డ్ గా సినిమా తీస్తాడని అందరూ ఎక్స్ పెక్ట్ చేశారు. దీంతోపాటే సరిగా సినిమా విడుదలకు రెండు రోజుల ముందు నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కూడా వాడుకోవడం స్టార్ట్ చేసేశాడు ఈ డైరెక్టర్. గతంలో ఓ స్టోరీ చెప్పానని.. కాని తరువాత ఆ పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ ఫిలిం వర్కవుట్‌ కాలేదని గతాన్ని తవ్వుకొచ్చాడు. దీంతో అని కన్నెగంటి పైనా.. ఈ దర్శకుడు ప్రస్తుతం తీసిన సినిమా పైనా మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగిన మాట వాస్తవమే. కానీ రన్ మూవీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది. పేరు రన్ అని పెట్టి.. మూవీ నేరేషన్ స్లో గా ఉండడంతో ఎవరికీ ఎక్కలేదు.

అయినా కంటెంట్ సరిగా లేకపోతే.. ప్రమోషన్లలో రామ్ చరణ్ ని వాడితే మాత్రం ఉపయోగం ఏం ఉంటుంది చెప్పండి.. మూవీలో మేటర్ ఉంటే.. మౌత్ పబ్లిసిటీతో అయినా ఆడేస్తుంది. అదే కంటెంట్ లేకపోతే.. స్టార్ హీరోలని వాడినా.. ఆడియన్స్ పట్టించుకోరనే విషయం మరోసారి ప్రూవ్ అయింది.