Begin typing your search above and press return to search.

కాలంతో రన్.. కేరక్టర్ లతో టీజర్

By:  Tupaki Desk   |   22 Feb 2016 3:44 AM GMT
కాలంతో రన్.. కేరక్టర్ లతో టీజర్
X
పబ్లిసిటీ కోసం పలు రకాల దారులు వెతుక్కోవాల్సిందే. ఎంత డిఫరెంట్ గా ప్రచారం చేస్తే.. అంతగా జనాల్లోకి వెళ్లచ్చు. కొత్త కొత్త ఐడియాలతో ప్రోమోలు ట్రై చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు సందీప్ కిషన్ - అనీషా ఆంబ్రోస్ జంటగా నటించిన 'రన్' చిత్రానికి ఫస్ట్ లుక్ విడుదల చేసిన 24గంటల్లోనే ఓ టీజర్ కూడా ఇచ్చారు. అయితే.. దీని స్పెషాలిటీ ఏంటంటే.. కేరక్టర్లను ఇంట్రడ్యూస్ చేసే టీజర్ అన్నమాట. ఇలా కేరక్టర్లను పరిచయం చేయడం కొత్త కాదు కానీ.. ఒకేసారి అన్ని పాత్రలను కలిపేసి ఓ ప్రోమో స్టైల్ లో ఇవ్వడం మాత్రం ఇదే ఫస్ట్.

'రన్' టీజర్ ని స్టార్ట్ చేసిన విధానం అదిరందని చెప్పాలి. ఇందులో హీరో - విలన్.. రెండూ టైమ్ అంటున్నారు. అసలీ సినిమాలో అందరికంటే ఇంపార్టెంట్ కాలంతో పెట్టే పరుగే అని ముందే చెప్పారు కూడా. సందీప్ కిషన్-సంజు - అనీషా-అమ్ము - బాబీ సింహ-వడ్డీ రాజా... ఇలా మొత్తం కేరక్టర్లన్నిటితో పాటు.. కార్ కి కూడా ఓ రోల్ ఇచ్చారు. ఇక చేవెళ్ల ఊరు అయితే న్యూజిలాండ్ అట. తాము చెప్పదలుచుకున్న విషయాన్ని సింపుల్ గా అయినా.. టీజర్ ద్వారా అర్ధమయ్యేట్లుగానే చెప్పారు సినిమా యూనిట్.

మిస్టర్ నూకయ్య ఫేమ్ అనిల్ అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిన 'రన్ '.. మార్చ్ 23 న విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు. ఏకే ఎంటర్ టెయిన్ మెంట్స్ పతాకంలో వస్తున్న చిత్రం కావడం, సందీప్ కిషన్ మంచి ఫాంలో ఉండడంతో.. ఈ డిఫరెంట్ రన్నింగ్ మూవీకి ఇండస్ట్రీలో బిజినెస్ బాగా జరుగుతోంది.