Begin typing your search above and press return to search.
బాలీవుడ్ ను భయపెడుతున్న ఆ సినిమా హిట్ టాక్
By: Tupaki Desk | 30 Jun 2022 1:30 AM GMTకరోనా మహమ్మారి ఇండియాలో అడుగు పెట్టినప్పటి నుండి కూడా బాలీవుడ్ ప్రమాధంలో పడ్డట్టు అయ్యింది. 2020 ఆరంభం నుండి ఇప్పటి వరకు సాలిడ్ సక్సెస్ ను హిందీ సినిమాలు దక్కించుకోలేక పోయాయి. మరో పక్క సౌత్ సినిమాలు వందల కోట్లు మించి వెయ్యి కోట్లు అంతకు మించి వసూళ్లు నమోదు చేస్తూ ఉంటే బాలీవుడ్ వర్గాల్లో ఆశ్చర్యం మరియు ఆవేదన కనిపిస్తోంది.
ఇదే సమయంలో బాలీవుడ్ సినిమాలకు వసూళ్లు రాకపోవడంకు కారణం ఏంటీ అంటూ విశ్లేషించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో అజయ్ దేవగన్ నటించిన రన్ వే 34 విడుదల అయ్యింది. గత చిత్రాల మాదిరిగానే అజయ్ దేవగన్ రన్ వే 34 కూడా దారుణమైన వసూళ్లు నమోదు చేసింది. వందల కోట్లు ఆశిస్తే మరీ తక్కువగా ఆ సినిమా రాబట్టింది.
సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా వసూళ్లు మాత్రం కనిపించలేదు. థియేటర్ లలో ఆడుతున్న సమయంలో పే పర్ వ్యూ పద్దతిన ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయడం జరిగింది. పే పర్ వ్యూ పద్దతిన రన్ వే 34 సినిమాను భారీ ఎత్తున చూశారు. ఇక రెగ్యులర్ స్ట్రీమింగ్ కు ఈ సినిమా వచ్చిన తర్వాత చూసిన వారి సంఖ్య మరింతగా పెరిగింది. ఓటీటీ లో రన్ వే 34 సినిమా కు హిట్ టాక్ వచ్చింది.
ఈమద్య కాలంలో వచ్చిన పెద్ద హీరోల సినిమాల్లో ఈ సినిమా వ్యూస్ పరంగా ఓటీటీ స్ట్రీమింగ్ మినిట్స్ పరంగా టాప్ లో ఉందని సమాచారం అందుతోంది. సినిమా కు ఓటీటీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. సినిమా ను చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. కాని వీరు ఎందుకు థియేటర్ కు రావడం లేదు అనేది ఇప్పుడు అందరిని తొలుస్తున్న ప్రశ్న.
బాలీవుడ్ ప్రేక్షకులు ఓటీటీ లకు బాగా కనెక్ట్ అయ్యారు. కరోనా వల్ల రెండు సంవత్సరాల పాటు థియేటర్లు దాదాపుగా మూత పడే ఉన్నాయి. ఆ సమయంలో ఓటీటీ ల ప్రభావం బాగా పెరిగింది. అందుకే ఇప్పుడు థియేటర్లకు జనాలు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని.. ఇదే పరిస్థితి కొనసాగితే బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఏంటీ అంటూ హిందీ ఫిల్మ్ మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని మాస్ సినిమాలను.. కొన్ని సౌత్ సినిమాలను ఉత్తరాది ప్రేక్షకులు థియేటర్లలో ఈ మద్య కాలంలో చూశారు. కాని హిందీ లో మీడియం రేంజ్ సినిమా లు... లవ్ కమ్ క్లాస్ సినిమా లను జనాలు పట్టించుకోవడం లేదు. కాని వాటికి ఓటీటీ లో మంచి డిమాండ్ ఉంది. అందుకే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఓటీటీ లతో గండం ముందు ముందు పెద్దగా ఉంటుందేమో అనే భయం వ్యక్తం చేస్తున్నారు. రన్ వే 34 హిట్ టాక్ ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ ను కంగారు పెటుతోంది.