Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ : ఇంట్రెస్టింగ్ 'రన్ వే 34'
By: Tupaki Desk | 11 April 2022 1:14 PM GMTబాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'రన్ వే 34' సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 29న ఈద్ సందర్బంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. విమానయాన రంగం చుట్టు తిరిగే కథ అంటూ ఇంతకు ముందే చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసిన టీజర్ తో చెప్పకనే చెప్పారు.
తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో సినిమా పై మరింత క్లారిటీ వచ్చేలా మేకర్స్ చేశారు. సినిమాలో అజయ్ దేవగన్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు పైలెట్స్ గా కనిపిస్తున్నారు.. అమితాబచ్చన్ ఈ సినిమాలో విచారణ అధికారికగా కనిపించబోతున్నాడు. అజయ్ దేవగన్ ను అమితాబచ్చన్ విచారించే సన్నివేశాలు మరియు విమానంలోని సన్నివేశాలు ప్రథానంగా ఉంటాయని తెలుస్తోంది.
అజయ్ దేవగన్ ఈమద్య కాలంలో గొప్ప కమర్షియల్ సక్సెస్ లను దక్కించుకోవడం లో విఫలం అవుతున్నాడు. ఆయన గతంలో అక్షయ్ కుమార్ తో పోటీ పడేవాడు. కాని ఇప్పుడు మాత్రం అక్షయ్ కుమార్ దూసుకు వెళ్తుంటే అజయ్ దేవగన్ మాత్రం నేల చూపులు చూసే పరిస్థితి వచ్చిందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో రన్ వే 34 సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అజయ్ దేవగన్ ఖచ్చితంగా ఈసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ట్రైలర్ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు మరింతగా పెరగడం తో అజయ్ దేవగన్ అభిమానులు ఆనందంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్వీయ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నిర్మించడం వల్ల సినిమా పై ఒకింత ఎక్కువ ఆసక్తి ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ట్రైలర్ లో విమానంలోని సన్నివేశాలు మరియు ఇతర సన్నివేశాలు సినిమాలో ప్రథాన ఆకర్షణగా ఉండబోతున్నాయని మేకర్స్ చెబుతున్నారు.