Begin typing your search above and press return to search.

గ్లాడియేట‌ర్ మ‌న‌సు దోచిన‌ వివాదాల క్వీన్ కంగ‌న‌!

By:  Tupaki Desk   |   14 Aug 2021 7:30 AM GMT
గ్లాడియేట‌ర్ మ‌న‌సు దోచిన‌ వివాదాల క్వీన్ కంగ‌న‌!
X
``బానిస‌త్వం చెల్ల‌దు.. బానిస‌ల్లో అజేయ‌మైన వీరులు ఉంటారు! క‌త్తి ప‌ట్టి మీదికి ఉరికితే రారాజుల‌కైనా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే`` ఇలాంటి ఆస‌క్తిక‌ర ఎమోష‌న‌ల్ థీమ్ తో తెర‌కెక్కిన గ్లాడియేట‌ర్ (2000) సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. రాజులు రాజ్యాలు పోయినా నాటి రోజుల్లో ఇలాంటి బానిస‌త్వం ఒక‌టి ఉండేద‌ని బానిస‌ల ప్రాణాల‌తో ఆడుకునే రాజుల‌కు క‌ళ్లు తెరిపించిన ఘ‌ట్టం ఉంద‌ని ప్ర‌పంచం క‌ళ్ల‌కు క‌ట్టిన తీరు ఇప్ప‌టికీ ప్రశంస‌లు అందుకుంటూనే ఉంది. ఆస్కార్ అవార్డులు కొల్ల‌గొట్టిన గ్లాడియేట‌ర్ చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ఈ చిత్రంలో బానిస‌గా వీరోచిత పోరాటాల‌తో ర‌క్తి క‌ట్టించే ర‌సెల్ క్రో న‌టన వీర‌ర‌సం ఆద్యంతం ఉత్కంఠను క‌లిగిస్తుంది.

రసెల్ ని ఇప్పుడే గుర్తు చేసుకోవ‌డం ఎందుకు? అంటే.. కంగనా రనౌత్ తో కలిసి పనిచేయమని కోరుతూ రస్సెల్ క్రో అభిమాని ట్వీట్ లో కోర‌గా అత‌డు అంగీక‌రించ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కంగ‌న‌కు జ‌త‌గా న‌టిస్తాన‌ని అత‌డు అన‌డంతో అది భార‌త‌దేశంలోనూ వేవ్స్ క్రియేట్ చేస్తోంది. ``రెండు విభిన్న చిత్ర పరిశ్రమలకు చెందిన ఇద్దరు గొప్ప నటులు అకాడమీ అవార్డు విజేత @రస్సెల్‌క్రోవ్ .. 4 సార్లు జాతీయ అవార్డుల విజేత #కంగనా రనౌత్ కలిసి సినిమా చేస్తే ఎంత బాగుంటుంది?`` అంటూ అభిమాని కోర‌గా దానికి ర‌సెల్ వెంట‌నే స్పందించారు. 2000 లో గ్లాడియేటర్ రిలీజై ఆస్కార్ లు కొల్ల‌గొట్టింది. మ‌రోసారి అలాంటి ఛాన్స్ రిపీట‌వుతుందేమో! అన్న ఆశ‌ను క‌న‌బ‌రిచాడు అభిమాని.

మరికొంతమంది అభిమానులు కూడా ఈ ఆలోచన బావుంద‌ని ఆసక్తి ని క‌న‌బ‌రిచారు. ఈ జంట తెర‌పై క‌నిపిస్తే ఆ సినిమా కోసం వేచి ఉండలేను అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించారు. అవును! ఇది బాగా ఉండాలి అని మరొకరు వ్యాఖ్యానించారు.

ఎ బ్యూటిఫుల్ మైండ్- నోహ్- ది నైస్ గైస్- మ్యాన్ ఆఫ్ స్టీల్ వంటి చిత్రాలతో ర‌సెల్ స్టార్ డ‌మ్ అసాధార‌ణంగా ఎదిగింది. ది మర్ఫిస్‌తో జాయ్ బ్రేక్ ఫాస్ట్ రేడియో ప్రోగ్రామ్ లో థోర్ 4 లో ఆఫ‌ర్ గురించి ర‌సెల్ వ్యాఖ్యానించారు. ``ఇప్పుడు నేను నా సైకిల్ ఎక్కబోతున్నాను. డిస్నీ-ఫాక్స్ స్టూడియోలకు వెళ‌తాను. నేను థోర్ 4లో జ్యూస్ గా న‌టిస్తున్నాను`` అని వెల్ల‌డించారు.

ఇదిలా ఉంటే కంగనా కొన్ని వారాలుగా బుడాపెస్ట్ లో ఉంది. ఇటీవ‌ల‌ యాక్షన్ చిత్రం `ధాకడ్` చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసింది. ఆమె అక్కడ తారాగణం - సిబ్బంది కోసం ఒక పార్టీని ఏర్పాటు చేయ‌గా..త‌న‌ కుటుంబ సభ్యులు కూడా ఈ పార్టీలో చేరారు.

కంగ‌న‌ చివరిసారిగా అశ్విని అయ్యర్ తివారి పంగాలో కనిపించింది. ఆమె త‌దుప‌రి తలైవిగా తెలుగు-త‌మిళం-హిందీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఇందులో ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించారు. అలాగే `తేజస్` అనే భారీ చిత్రంలోనూ కంగ‌న న‌టిస్తోంది. ఇందులో ఆమె పైలట్ పాత్రను పోషిస్తుంది. ధాకాడ్ లో అర్జున్ రాంపాల్- దివ్య దత్తా కూడా నటించారు. యాక్షన్ థ్రిల్లర్ లో కంగనా ఏజెంట్ అగ్ని అనే గూఢచారిగా నటిస్తోంది.

త‌లైవి ఓవ‌రాల్ గా కంగ‌న‌ కెరీర్ స్పెష‌ల్

కంగ‌న న‌టిస్తున్న త‌లైవి ప్ర‌స్తుతం సౌతిండ‌స్ట్రీస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ కంగ‌న కెరీర్ కే యూనిక్ అన‌డంలో సందేహ‌మేం లేదు. ఇక ఇందులో పాత్ర‌ధారులు అంతగా ఒదిగిపోయి ఎంచుకున్న‌ పాత్ర‌ల్లో జీవించారని తెలిసింది. అమ్మ జ‌య‌ల‌లిత‌గా కంగ‌న‌.. ఎంజీఆర్ గా అర‌వింద స్వామి అచ్చు గుద్దిన‌ట్టు స‌రిపోగా.. ఇందిరాగాంధీ పాత్ర‌ధారి అంతే యాప్ట్ గా కుదిరార‌ట‌. తాజాగా త‌లైవి కొత్త ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

ఏ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి విష్ణు ఇందూరి - శైలేష్ ఆర్. సింగ్ నిర్మాత‌లు. రాజ‌కీయాల్లో ఐరన్ లేడీగా పాపుల‌రైన‌ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తమిళం- తెలుగు-హిందీలో ఈ చిత్రం అత్యంత భారీగా రిలీజ్ కానుంది. కంగ‌న త‌న కెరీర్ లో స్పెష‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంటుంద‌నే అభిమానులు వేచి చూస్తున్నారు.