Begin typing your search above and press return to search.

హాలీవుడ్ కంటే ముందే ర‌ష్యన్ సినిమా రికార్డు !

By:  Tupaki Desk   |   3 Jan 2023 3:30 PM GMT
హాలీవుడ్ కంటే ముందే ర‌ష్యన్ సినిమా రికార్డు !
X
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ త‌దుప‌రి చిత్రాన్ని స్పేస్ లో షూట్ చేస్తున్నామంటూ ఊరించ‌డం త‌ప్ప ఇంత వ‌ర‌కూ జ‌రిగింది లేదు. ఓ సీక్వెన్స్ కోసం నాసా సహ‌కారంతో అంత‌రిక్షంలోకి వెళ్తున్నామంటూ ప్ర‌చారం త‌ప్ప ఇప్ప‌టివ‌ర‌కూ ఆ స‌న్నివేశం క‌నిపించలేదు. దీంతో ఆయ‌న‌కంటే ముందే ర‌ష్యా ఆ ఫీట్ సాధించింది. ర‌ష్యా ద‌ర్శ‌కుడు క్లిమ్ షిపెంకో 'ది ఛాలెంజ్' అనే సినిమాని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

2021 అక్టోబ‌ర్ లో స్పేస్ లో కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఇందులో న‌టి యూలియా పెరెస్లిడ్ తో క‌లిసి 12 రోజుల పాటు ఐఎన్ ఎస్ లో గ‌డిపారు. దీంతో స్పేస్ లో షూటింగ్ జ‌రుపుకున్న తొలి చిత్రంగా వ‌ర‌ల్డ్ సినిమాలో 'ది ఛాలెంజ్' అరుదైన రికార్డు సృష్టించింది. తాజాగా ఆసినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఓ కాస్మోనాట్ ప్రాణాలు కాపాడేందుకు ఐఎస్ ఎస్ కి వెళ్లిన డాక్ట‌ర్ పాత్రలో యూలియా క‌నిపిస్తుంది.

చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా ఐఎస్ ఎస్ లో ల్యాండ్ అయిన తీరును టీజ‌ర్ లో ఆద్యంతం మ‌లిచారు. సినిమాలో ఈ సీన్‌ దాదాపు 35 నుంచి 40 నిమిషాలు ఉండనున్నట్లు స‌మాచారం. ఈ షూట్ టీమ్ లో మ‌రింత న‌మ్మ‌కాన్ని పెంచింది. మ‌రిన్ని వండ‌ర్స్ క్రియేట్ చేయ‌డానికి ఇలాంటి స‌న్నివేశాలు ఎంతో స్పూర్తిని నింపుతున్నాయ‌న్నారు. చంద్రునితో పాటు.. అంగార‌కునిపైనా షూటింగ్ చేస్తామ‌ని ద‌ర్శ‌కుడు క్లిమ్ తెలిపారు.

రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్‌ ఎంఎస్‌19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్‌ ష్కాప్లెరోవ్‌తో కలిసి ఐఎస్‌ఎస్‌ వెళ్లారు. కజకిస్థాన్‌లోని బైకోనుర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. హీరోయిన్‌గా ఎంపికైన యులియా కొంతకాలం స్పేస్ శిక్షణ కూడా తీసుకున్నారు. అక్క‌డ ట్రైనింగ్ స‌హా ఆరోగ్య వంత‌మైన మ‌హిళ కావ‌డంతోనే ఈసాహ‌సానికి అనుమ‌తించారు. ఆర‌కంగా హాలీవుడ్ అమెరికా కంటే ర‌ష్యా ఈ రికార్డును సృష్టించ‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.