Begin typing your search above and press return to search.
గ్లామర్ భామ ఫ్లోర్ క్లీన్ చేస్తోందే
By: Tupaki Desk | 13 April 2020 12:10 PM GMTఈతరం మనుషులు చాలామంది ఇంటిపని చెయ్యరు. ముఖ్యంగా గిన్నెలు కడగడానికి.. ఇల్లు ఊడ్చుకోవడానికి.. ఫ్లోర్ ను తడిబట్టతో శుభ్రం చేయడానికి.. ఇలా ప్రతి పనికి పనిమనుషులు ఉంటారు. ఇక వంట అంటారా? స్విగ్గీలు.. జొమాటోలు తగలడ్డాయి కదా! మిడిల్ క్లాస్ ఇళ్లలోనే ఇలా ఉంటే సెలెబ్రిటీల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది? ఇంటిపని వంటపనికి ఆ మాటకొస్తే ప్రతి పనికీ పని మనుషులు ఉంటారు కాబట్టి దిగులే లేదు. అయితే కోవిడ్-19 పుణ్యమా ఇదంతా మారిపోయింది. లాక్ డౌన్ పుణ్యమా అని అందరూ ఇంటిపట్టున ఉండాల్సి వస్తోంది. దీంతో ఎవరి పనులు వారే చేసుకోవాలి.. తప్పదు. సెలెబ్రిటీలు అనే మినహాయింపు కూడా లేదు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే స్వయంగా మాస్క్ ధరించి సూపర్ మార్కెట్ కు వెళ్లి సరుకులు కొన్నారంటేనే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ మాత్రమే కాదు ఎంతో మంది స్టార్ లు తమ ఇంటిపనులు తామే చేసుకుంటున్నారు. తాజాగా ఆరెక్స్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కూడా ఈ విషయం వెల్లడించింది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "జీవితం ఇలా ఉంది. #క్వారంటైన్" అంటూ ట్వీట్ చేసింది. ఈ ఫోటోలో నిజానికి రెండు ఫోటోలు ఉన్నాయి. అవి 'కరోనాకు ముందు కరోనా తర్వాత' అన్నట్టుగా ఉన్నాయి.
ముందు ఫోటోలో పాయల్ చక్కగా రెడీ అయ్యి మేకప్ వేసుకుని మరీ యోగా మ్యాట్ పై కూర్చుని ఉంది. అదే రెండో ఫోటోలో నైట్ గౌన్ ధరించి తడి బట్టతో ఫ్లోర్ ను శుభ్రంగా తుడుస్తోంది. సహజంగా ఇలాంటి మాపు కొట్టే డ్యూటీ సెలబ్రిటీలు చచ్చినా చెయ్యరు. ఒకవేళ చేసినా అది ఇలా బయటకు చెప్పుకోరు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెలబ్రిటీలు తాము పని చేస్తున్నామని ఎంతో ఓపెన్ గా చెప్పుకుంటున్నారు. సభ్యసమాజానికి లాక్ డౌన్ సమయంలో ఎవరి పనులు వారు చేసుకోవాలనే సందేశం ఇస్తున్నారు. ఇలా కొన్ని రోజులు కొనసాగితే ఈ సెలబ్రిటీలు ఇంటిపనులు.. వంటపనుల పోటీల్లో 'పష్టు క్లాసులో ప్యాస్ అవుతారబ్బీ.'