Begin typing your search above and press return to search.
హౌస్ ఫుల్ బోర్డుల దుమ్ముదులిపిన ఆర్ ఎక్స్100
By: Tupaki Desk | 16 July 2018 3:45 PM GMTఈ మధ్య సాధారణ థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడం బాగా అరుదు. స్టార్ హీరో సినిమాలకు ఒకట్రెండు రోజుల మినహాయిస్తే మిగతా రోజుల మామూలే. ఒక్క బాహుబలి మాత్రమే ఈ మధ్య కాలంలో రెండు మూడు వారాలు థియేటర్లు నింపింది. ఆ కథ వేరు. కానీ ఒక చిన్న సినిమా. పాపులర్ కాని బ్యానర్. ఎవరికీ తెలియని హీరో హీరోయిన్లు. కొత్త దర్శకుడు. ఎవరైనా ఈ సినిమాపై అంచనాలు ఎలా పెట్టుకుంటారు? కచ్చితంగా రిలీజ్‌కు వారం రోజుల ముందు ఎవరూ లెక్కలోకి తీసుకోని ఈ సినిమా థియేటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డుల దుమ్ము దులిపింది.
గురువారం విడుదలైన ఈ సినిమా గ్రాస్-షేర్ లెక్కలు చూస్తే బాక్సాఫీసుకే దిమ్మతిరిగింది. ఒక అన్నోన్ సినిమా చరిత్రను తిరగరాసింది. ఎన్నో వివాదాలతో అర్జున్ రెడ్డి సృష్టించిన రికార్డులను ఏ వివాదమూ లేకుండానే ఈ సినిమా సృష్టించింది. రేటింగులు పడకపోయినా మౌత్ టాక్‌తో బీభత్సంగా జనాలకు చేరిన ఈ సినిమా మొదటి వీకెండ్‌లో ప్రతి రోజూ హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టే పరిస్థితిని తెచ్చింది.
మొదటి రోజు గురువారం 1.31 కోట్లు రాగానే ఏమిటీ ఓపెనింగ్స్ అని అందరూ ఆశ్చర్యపోయారు. పైగా మెగా హీరో సినిమాతో ఇది పోటీపడింది. ఇక రెండో రోజు 1.1 కోట్లు షేర్ రాగా - మూడో రోజు 1.31 కోట్లు - నాలుగో రోజు ఆదివారం కోటి 42 లక్షల షేర్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి వీకెండ్ మొత్తం షేర్ 5.11 కోట్లు. అయితే, ఈ సినిమా నిర్మాణ ఖర్చే కేవలం రెండు కోట్లు. తొలి నాలుగు రోజుల గ్రాస్ దాదాపు పది కోట్లు. ఈ సినిమా ఫుల్ రన్ లో 12 కోట్లు సంపాదిస్తుందని అంచనాలు వేస్తున్నారు. నిర్మాతలకు, పంపిణీ దారులకు ఈ సినిమా కోట్లు కుమ్మరించింది.
అయితే, రీమేక్ రైట్సే సినిమా నిర్మాణం కంటే ఎక్కువ ఖరీదుకు అమ్మే అవకాశాలున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ - శాటిలైట్ రైట్లు కూడా కొత్త సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉంది.
మొదటి వీకెండ్ కలెక్షన్లు
నైజాం - 2,35,00,000
సీడెడ్ - 59,00,000
నెల్లూరు - 10,58,116
గుంటూరు - 36,46,663
కృష్ణా - 34,86,838
ప.గో. జిల్లా - 31,54,193
తూ.గో. జిల్లా - 42,53,309
ఉత్తరాంధ్ర - 61,19,595
మొత్తం తెలుగు రాష్ట్రాల షేర్ - Rs 5.11 కోట్లు
ఓవర్సీస్ - 30,00,000
ఇతర రాష్ట్రాలు - 25,00,000
మొత్తం వరల్డ్ వైడ్ షేర్ - - Rs. 5.66 కోట్లు.