Begin typing your search above and press return to search.
అగ్ర బ్యానర్లకు అడ్వాన్సులు వెనక్కి!
By: Tupaki Desk | 8 Jun 2019 5:48 AM GMTఒకే ఒక్క బ్లాక్ బస్టర్ తో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్నాడు హీరో కార్తికేయ. అసలు ఏ అంచనాలు లేకుండా వచ్చిన RX100 అతడి జాతకం మార్చేసింది. ఇప్పటికిప్పుడు వరుసగా నాలుగైదు సినిమాలు అతడి క్యూలో ఉన్నాయి. అయితే ఒక్క హిట్టు ఎంత ప్రభావం చూపిస్తుందో పరాజయం కూడా అంతే ప్రభావం చూపిస్తుంది ఈ రంగుల పరిశ్రమలో. ప్రస్తుతం కార్తికేయ నటించిన రెండో సినిమాపై తొలి రోజు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఆర్.ఎక్స్ 100 ప్రభావమో ఏమో కానీ `హిప్పీ` చిత్రం జనాలకు ఆశించిన స్థాయిలో కనెక్టవ్వలేదు. ఈ సినిమా వాస్తవిక రిజల్ట్ ఏమిటి? అన్నదానిపై సోమవారం వరకూ వేచి చూడాల్సిందే. అయితే కార్తికేయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది..? అన్నదానిపై కార్తికేయ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. తొలి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రెండో సినిమా విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. వయసుకు తగ్గట్టే రొమాంటిక్ లవ్ స్టోరీలే చేయాల్సి వస్తోందని అన్నారు. సహజసిద్ధత ఉన్న కథల్ని ఎంచుకుంటానని తెలిపారు.
తదుపరి ప్రాజెక్టుల గురించి కార్తికేయ చెబుతూ.. హిప్పీ తర్వాత మూడు సినిమాలు క్యూలో ఉన్నాయి. గుణ 369 చేస్తున్నా. అలాగే శేఖర్‌రెడ్డి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా.. శ్రీ సారిపల్లి అని మరో దర్శకుడితో వేరొక సినిమా చేస్తున్నా.. అలాగే సొంత బ్యానర్ సినమా చేయబోతున్నాను.. అని తెలిపారు. పెద్ద బ్యానర్లలో చేయరా? అన్న ప్రశ్నకు.. అప్పట్లోనే కొన్ని పెద్ద బ్యానర్ల నుంచి అడ్వాన్సులు తీసుకున్నా కానీ కుదరలేదు. దర్శకులు మారడంతో అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేశానని వెల్లడించారు. అయితే పెద్ద బ్యానర్లతో దర్శకుల విషయంలోనేనా.. ఇంకేదైనా చిక్కొచ్చిందా? అన్నది కార్తికేయ చెప్పలేదు. ఇకపోతే ఈ ట్యాలెంటెడ్ నటుడికి హిప్పీ ప్లస్సా మైనస్సా అన్నది కాలమే నిర్ణయించాలి. మరోవైపు కార్తికేయ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలకు అంగీకరిస్తున్న సంగతి తెలిసిందే.