Begin typing your search above and press return to search.
ఆరెక్స్ 100 హీరోని మోసం చేసారు
By: Tupaki Desk | 28 July 2018 5:30 PM GMTసినిమా పరిశ్రమలో మోసాలు పలురకాలు. ఇందులో బయటికి రానివే ఎక్కువగా ఉంటాయి. అవకాశాల కోసం వచ్చి డబ్బు పోగొట్టుకున్నాం అంటే ఎవరూ జాలి చూపరు కాబట్టి సాధారణంగా ఇలాంటి విషయాలు బయటికి రావు. ఎంతసేపు కాస్టింగ్ కౌచ్ గురించిన వివాదమే తప్ప ఛాన్సుల పేరుతో దోచుకునే వాళ్ళ వ్యవహారాలు గప్ చుప్ గా ఉంటాయి. ఆరెక్స్ 100 హీరో కార్తికేయ స్వయంగా ఓ నిజాన్ని బయటపెట్టడంతో విన్నవాళ్ళు షాక్ అవుతున్నారు. హీరోగా చేయాలని అవకాశాల కోసం కార్తికేయ తిరుగుతున్నప్పుడు ఓ లక్ష రూపాయలు ఇస్తే నిన్నే కన్ఫర్మ్ చేస్తామని డబ్బులు తీసుకుని ఎగొట్టిన వాళ్ళు చాలానే ఉన్నారని చెప్పాడు. ఇచ్చాక సెల్ ఫోన్ స్విచ్ అఫ్ చేసుకుని పెట్టుకోవడంతో పాటు ఎక్కడా అడ్రెస్ లేకుండా మాయమైపోయేవారని ఆ సమయంలో అజయ్ భూపతిని కలవడం తనకు పెద్ద బ్రేక్ వచ్చేలా చేసి హీరోగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చిందని చెప్పాడు.
కార్తికేయ చెప్పింది కొత్త సంగతి కాదు. సక్సెస్ లో ఉన్నవాడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఇది చర్చలోకి వస్తోంది. కానీ పరిశ్రమలో ఆర్ధిక మోసాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. సినిమాలో అవకాశం కావాలంటే ఎదురు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసే వాళ్ళ లిస్ట్ చాంతాడంత ఉంది. కానీ ఇదంతా అసంఘటిత వ్యవస్థ కావడంతో బాధితులు బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. దానికి తోడు తెలిసి ఎలా మోసపోయావ్ అని జాలి చూపులు చూస్తారు కాబట్టి ఎంతో పోగొట్టుకున్నవాళ్ళు సైతం సైలెంట్ అయిపోయిన దాఖలాలు ఉన్నాయి. కార్తికేయకు వెనుక కాస్త సపోర్ట్ ఉంది కాబట్టి సర్దుకున్నాడు. అలా కాకుండా మోసగాళ్ల మాటలు నమ్మి లక్షలు లక్షలు వడ్డీకి అప్పు తెచ్చి నిండా మునిగిన వాళ్ళకు కొదవే లేదు. మొత్తానికి కార్తికేయ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇండస్ట్రీలో పురుష బాధితులు చాలానే ఉన్నారనే విషయంలో క్లారిటీ వచ్చేసింది.