Begin typing your search above and press return to search.
వికీపీడియా తప్పు గురించిన కార్తికేయ!!
By: Tupaki Desk | 28 Sep 2018 7:34 AM GMTనిన్న విడుదలైన డబుల్ ఎన్ అదే నాగార్జున నానిల మల్టీ స్టారర్ ఏ రేంజ్ హిట్ అనేది తేలడానికి ఇంకొద్ది రోజులు పడుతుంది కానీ ప్రేక్షకులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు నిన్న వచ్చిన ఓపెనింగ్స్ ని బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా నాగ్ నానిల కాంబో సీన్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎంటర్ టైన్మెంట్ ని ప్లాట్ గా తీసుకుని ఇద్దరు హీరోలతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మెప్పించిన తీరు బాగానే ఆకట్టుకుంటోంది.
నాని యూత్ కాబట్టి ప్రత్యేకంగా లుక్స్ గురించి చెప్పాల్సిన పని లేదు కానీ నాగ్ యాభై ఏళ్ళు దాటి తొమ్మిది సంవత్సరాలు దాటుతున్నా ఇంకా మన్మథుడి సీట్ ని అలాగే అట్టిపెట్టుకోవడం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంట్రో సాంగ్ లో షర్ట్ లేకుండా బాడీ యాబ్స్ ని చూపిస్తూ నాగ్ అలా నడిచి వస్తుంటే నిజంగా ఈ మనిషి వయసు ఎంత అని అనుకోని వారు లేరు. హ్యాండ్ సంగా కనిపించడంలో తన తరువాతే ఎవరైనా అని మరోసారి నిరూపించాడు.
ఇదే విషయంగా ఆరెక్స్ 100 హీరో కార్తికేయ భిన్నంగా స్పందించాడు. ట్విట్టర్ ఆ బైట్ తాలూకు చిన్న వీడియోని పోస్ట్ చేస్తూ వికీపీడియాలో నాగ్ వయసు 59 అని ఉందని అది తప్పు చూపిస్తుందేమోనని 20 ఏళ్ళ యువకులకు సైతం ఛాలెంజ్ చేసేలా ఆ బాడీలో ఏమున్నాడ్రా బాబు అని కామెంట్ చేయటం అక్కినేని అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. కార్తికేయ చెప్పినదాంట్లో నిజంగానే అతిశయోక్తి లేదు.
నాగ్ తన వయసుని ఓ ముప్పై ఏళ్ళ క్రితమే పాస్ బటన్ నొక్కి పెట్టాడా అనేలా ఉన్నాడు. ప్లాన్ చేసుకుని చైతు సామ్ కనక పిల్లల్ని కంటే తాతయ్య అనిపించుకునే వయసులో తన వారసులకు గ్లామర్ విషయంలో వాళ్ళకే సవాల్ విసరడం అంటే చిన్న విషయం కాదుగా. అందుకే మన్మధుడికి ఎన్ని సీక్వెల్స్ తీసినా దానికి నాగార్జున మించిన ఆప్షన్ ఎవరు ఉండరు.