Begin typing your search above and press return to search.
RX100 కార్తికేయ కొత్త సినిమా స్టార్ట్!
By: Tupaki Desk | 27 Dec 2018 4:56 PM GMTడెబ్యూ సినిమా 'RX100' తోనే సంచలన విజయం సాధించడమే కాకుండా లుక్స్.. యాక్టింగ్ విషయం లో ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే సాధించాడు హీరో కార్తికేయ. ఇప్పటికే కార్తికేయ సెకండ్ సినిమా 'హిప్పీ' ప్రారంభం అయింది. ఈ సినిమా కాకుండా మరో సినిమాను గురువారం లాంచ్ చేశారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకు బోయపాటి శ్రీను దగ్గర శిష్యరికం చేసిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తాడు.
ఈ సినిమా లాంచ్ ఈవెంట్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి బోయపాటి శ్రీను.. సీనియర్ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమా ముహూర్తపు షాట్ కు బోయపాటి క్లాప్ కొట్టాడు. కమెడియన్ అలీ.. ప్రవీణ్ కడియాల కెమరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను తన శిష్యుడు అర్జున్ జంధ్యాల గురించి గొప్పగా చెప్పాడు. తనతో పాటు పన్నెండు సంవత్సరాలు అసోసియేట్ గా ప్రయాణం చేశాడని.. తనకు అర్జున్ తమ్ముడి లాంటి వాడని తెలిపాడు. అర్జున్ కు టాలెంట్.. టైమింగ్ రెండూ ఉన్నాయని చెప్పాడు. హీరో కార్తికేయ మాట్లాడుతూ 'RX100' తర్వాత చాల కథలు విన్నానని.. వాటన్నిటిలో ది బెస్ట్ కథ ఇదేనని.. షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నానని చెప్పాడు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు చైతన్య భరధ్వాజ్.. సినిమాటోగ్రాఫర్ రామ్. ఈ సినిమాను అనిల్ కడియాల 'జ్ఞాపిక ఎంటర్ టైన్‌మెంట్స్'.. తిరుమల్ రెడ్డి 'స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్' బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.