Begin typing your search above and press return to search.
ఆర్.ఎక్స్ జోరుకి అడ్డే లేదు
By: Tupaki Desk | 17 July 2018 9:49 AM GMTనిన్నటిదాకా సూపర్ హిట్ అనిపించిన `ఆర్.ఎక్స్.100` ఇప్పుడు బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. వీకెండ్ పూర్తయిన మరుసటి రోజు కూడా ఆ సినిమాకి వసూళ్లు హోరెత్తాయి. యువతరానికి సినిమా నచ్చిందంటే ఇక అది వీకెండా - మరొకటా అని చూడకుండా థియేటర్ కి క్యూ కడుతుంటారు. అది `ఆర్.ఎక్స్.100` సినిమాతో మరో మారు రుజువైంది. తొలి వీకెండ్ పూర్తయ్యేలోపే సినిమాకి 5.20 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ వసూళ్లలో అయితే 10 కోట్లగా లెక్క తేలింది. అంతటితో ఆ సినిమా ఆగడం లేదు.
సోమవారానికి వచ్చేసరికి రూ: 6.16 కోట్లకి షేర్ పెరిగింది. దీన్నిబట్టి సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని థియేటర్లకి ఆకర్షిస్తుందో అర్థం అవుతోంది. చిన్న సినిమాల్లో ఈయేడాది ఈ రేంజి సక్సెస్ సాధించిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. దీంతోపాటే విజేత - చినబాబు వంటి చిత్రాలు విడుదలయ్యాయి. వాటికి కూడా మంచి రివ్యూలే వచ్చాయి. అయినా సరే.. ఆర్.ఎక్స్.100 మాత్రం గేరు మార్చేసి తన జోరును చూపిస్తూనే ఉంది. శాటిలైట్ మార్కెట్ - డిజటల్ - ఓవర్సీస్ వసూళ్లతో కలుపుకొంటే ఈ సినిమా లాభాలు మరింత భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ఇలాంటి ఫలితాలు ఇండస్ట్రీకి చాలా మంచి చేస్తాయని...ముఖ్యంగా చిన్న సినిమాలకి మరింత ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.