Begin typing your search above and press return to search.
ఆర్ ఎక్స్ 100...దేవరకొండ చేయాల్సింది
By: Tupaki Desk | 4 July 2018 5:41 AM GMTఒక కొత్త దర్శకుడు కొత్త హీరో హీరోయిన్లతో చేసిన సినిమా ‘ఆర్ ఎక్స్ 100’. అయినప్పటికీ ఆసక్తికర ప్రోమోలతో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగింది. రియలిస్టిక్ గా.. ‘రా’గా కనిపించిన ఈ సినిమా ట్రైలర్ చూసి చాలామంది దీన్ని ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పోల్చారు. ఐతే నిజానికి ఈ చిత్రాన్ని ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండతోనే చేయాల్సిందట. ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి ముందు ఈ కథను విజయ్ కే చెప్పాడట. అతడికి కూడా ఈ కథ నచ్చిందట. ఐతే అప్పటికి ‘పెళ్ళిచూపులు’ సినిమాలో బిజీగా ఉన్న విజయ్.. కొంత కాలం ఆగమన్నాడట. విజయ్ తో సినిమా చేయడం ఆలస్యమయ్యేలా ఉండటంతో తాను కార్తికేయను పెట్టి ఈ సినిమా చేసినట్లుగా వెల్లడించాడు అజయ్.
నిజంగా విజయ్ దేవరకొండే ఈ సినిమా చేసి ఉంటే.. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఇది రిలీజైతే ఇంకా మంచి హైప్ వచ్చేదేమో. రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన అజయ్.. ‘ఆర్ ఎక్స్ 100’లో తనదైన ముద్ర చూపించినట్లే కనిపిస్తున్నాడు. ప్రోమోల వరకైతే ఈ చిత్రం బాగానే ఆకర్షిస్తోంది. మరి సినిమాగా ఎలా ఉంటుందో చూడాలి. కార్తికేయ సరసన కొత్తమ్మాయి పాయల్ రాజ్ పుత్ నటించిన ఈ చిత్రంలో రావు రమేష్.. రాంకీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కార్తికేయ సొంత నిర్మాణ సంస్థ ‘కార్తికేయ క్రియేటివ్ వర్క్స్’ అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించాడు. యాక్షన్.. రొమాన్స్ కలగలిసిన ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ వయొలెంట్ లవ్ స్టోరీ అంచనాల్ని ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.