Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ సీఎం అయితే గ‌ర్వాంగా ఫీల‌వుతా! ఎస్.జె. సూర్య‌!

By:  Tupaki Desk   |   27 Nov 2022 3:32 PM GMT
ప‌వ‌న్ సీఎం అయితే గ‌ర్వాంగా ఫీల‌వుతా! ఎస్.జె. సూర్య‌!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా..పాలిటిక్స్ అంటూ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం గురించి తెలిసిందే. ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనూ ..మ‌రోవైపు ఏపీలో రాజ‌కీయాలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఏపీ రాజ‌కీయం వెడెక్క‌డంతో పీకీ రంగంలోకి దిగ‌డం...రోడ్ల‌పై బైఠాయించ‌డంతో ఎలాంటి స‌న్నివేశం త‌లెత్తిందో తెలిసిందే. సీఎం సీఎం అంటూ జ‌న‌సైనుకుల నిర‌స‌న‌లు..నినాదాల‌తో హోరెత్తించారు.

పీకే సీఎం కావాలంటూ చాలా చోట్ల అప్పుడే ప్ర‌త్యేక పూజ‌లు మొద‌లు పెట్టారు. కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్టే స‌మ‌యం కూడా స‌మీపించ‌డంతో వ‌చ్చే ఏడాది నుంచి రాజ‌కీయాల్లో ఇంకా మార్పులు చోటు చేసుకుంటాయ‌ని తెలుస్తోంది. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై అత‌ని స్నేహితుడు..ద‌ర్శ‌కుడు..న‌టుడు ..నిర్మాత ఎస్ .జె సూర్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

`ప‌వ‌న్ క్యాణ్ స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సు తెలుగు రాష్ర్టాల ప్ర‌జ‌ల‌కు తెలుసు. అత‌ను నాకు మంచి స్నేహితుడు. ఇద్ద‌రు క‌లిసి చాలా కాలంగా జ‌ర్నీ చేస్తున్నాం. ఏదో ఒక రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ముఖ్య‌మంత్రి అవుతారు. అప్పుడు నేను గ‌ర్వంగా ఫీల‌వుతాను` అని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు జ‌నసైనుకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. థాంక్యూ అన్నా ...అన్న క‌చ్చితంగా సీఎం అవుతాడు.

మీరు గ‌ర్వంగా ఫీల‌య్యే రోజు ద‌గ్గ‌ర‌ల్లోనే ఉంది అంటూ సంబ‌ర ప‌డుతున్నారు. పవ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా ఎస్. జె సూర్య కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `ఖుషీ` అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ప‌వ‌న్ ఇమేజ్ పెంచిన చిత్రంగా నిలిచింది. కానీ అదే కాంబినేష‌న్ మ‌ళ్లీ చేతులు క‌ల‌ప‌డానికి చాలా సంవ‌త్స‌రాలు ప‌ట్టింది.

కొన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ `కొమ‌రం పులి` సినిమాకి క‌లిసి ప‌నిచేసారు. కానీ భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ప్ర‌స్తుతం ఎస్. జె సూర్య కోలీవుడ్ లో న‌టుడిగా స్థిర‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌త్వానికి దూరంగా ఉంటూ న‌టుడిగా స‌త్తా చాటుతున్నాడు. భిన్న‌మైన పాత్ర‌లు పోషించి ఆక‌ట్టుకుంటున్నాడు. ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ -శంక‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న చిత్రంలోనూ విలన్ పాత్ర పోషిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.