Begin typing your search above and press return to search.

27 ఏళ్ల తర్వాత ఆ లెజెండ్స్ ఇద్దరూ కలిసి..

By:  Tupaki Desk   |   19 Jan 2018 12:54 PM IST
27 ఏళ్ల తర్వాత ఆ లెజెండ్స్ ఇద్దరూ కలిసి..
X
దక్షిణాది సినీ పరిశ్రమ మాత్రమే కాదు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీనే గర్వించదగ్గ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం.. యేసు దాసు. పాటలు పాడటంలో వీళ్లిద్దరిదీ విభిన్నమైన శైలి. ఐతే ఎవరి స్థాయిలో వాళ్లు ఉన్నత శిఖరాల్ని అధిరోహించారు. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. 70 ప్లస్ వయసులోనూ తమ గానామృతాన్ని పంచుతూ అభిమానుల్ని అలరిస్తూ సాగిపోతున్నారీ దిగ్గజాలు. 1991లో రిలీజైన మణిరత్నం సినిమా ‘దళపతి’లో ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి ఒక పాట పాడారు. ‘సింగారాల పైరులోన..’ అంటూ సాగే ఆ పాట అప్పట్లో సూపర్ హిట్టయింది.

ఇప్పుడు మళ్లీ 27 ఏళ్ల తర్వాత బాలు.. యేసుదాసు కలిసి ఒక పాట పాడటం విశేషం. వాళ్లు ఈసారి తమిళం.. మలయాళ భాషల్లో పాట పాడారు. ఈ రెండు భాషల్లో తెరకెక్కుతున్న ‘కేని’ అనే సినిమా కోసం బాలు.. యేసుదాసు కలిసి పాట రికార్డ్ చేశారు. ఈ చిత్రంలో జయప్రద.. రేవతి.. అను హాసన్ లాంటి నిన్నటి తరం హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఏ నిషాద్ ఈ చిత్రానికి దర్శకుడు. యేసుదాసు కొన్నేళ్లుగా ఎక్కువగా ఆధ్యాత్మిక పాటలే పాడుతున్నారు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్నారు. బాలు కూడా కొన్నేళ్ల నుంచి పాటలు తగ్గించేశారు. గత ఏడాది ఆయన తెలుగులో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’.. ‘శతమానం భవతి’ లాంటి సినిమాలు పాటలు పాడారు.