Begin typing your search above and press return to search.
ఆ హీరో తప్పుకొని రాజమౌళికి లైన్ క్లియర్ చేశాడా..??
By: Tupaki Desk | 3 March 2021 7:30 AM GMTదర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సిరీస్ సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆలస్యంగా సినిమాలు తీస్తాడు కానీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాడనే నమ్మకం ఆయనతో పాటు అందరికి కలిగిస్తాడు. బాహుబలికి ఐదేళ్లు సమయం తీసుకున్న రాజమౌళి.. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకోసం దాదాపు మూడేళ్ల పైనే కేటాయించాడు. ఎందుకంటే 2017లో బాహుబలి-2 విడుదలైంది. వెయ్యికోట్లు కలెక్షన్స్ సాధించి రికార్డులు బద్దలుకొట్టింది. ఇదిలా ఉంటే.. రాజమౌళి ఎన్నో ఏళ్లుగా మహాభారతం రూపొందించాలనే కోరికతో ఉన్నాడు. చాలాసార్లు మహాభారతం తీయడం తన కల అని కూడా మీడియా సమావేశాలలో ప్రకటించాడు. అయితే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ హీరోగా మహాభారతం ప్లాన్ చేశారు అక్కడి మేకర్స్. సినిమాను అధికారికంగా కూడా ప్రకటించారు.
అయితే ఈ విషయం తెలిసి రాజమౌళి నిరాశకు గురయ్యాడని వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. అమిర్ ఖాన్ ఏ సినిమాకైనా కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తాడు. అయితే పౌరాణిక ఇతిహాసం మహాభారతం నుండి అమిర్ ఖాన్ తప్పుకున్నట్లు బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. దాదాపు రెండేళ్లకు పైగా మహాభారతం పై రీసెర్చ్ జరుగుతుంది. ఇంతలో అమిర్ స్వయంగా ప్రాజెక్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మహాభారతం కోసం అమిర్ ఖాన్ దాదాపు ఐదేళ్లు కేటాయిస్తాడని.. అలాగే అది వెబ్ సిరీస్ రూపంలో విడుదల చేస్తారని చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ ప్రాజెక్ట్ చుట్టూ అల్లుకున్న వివాదలను దృష్టిలో పెట్టుకొని అమిర్ తప్పుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మహాభారతం నుండి అమిర్ తప్పుకోవడంతో రాజమౌళి హ్యాపీ అని.. ఆయనకు దారి క్లియర్ అయిందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్. ప్రస్తుతం అమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' పై ఫోకస్ పెట్టాడు. అలాగే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ఫినిష్ చేసేపనిలో ఉన్నాడు.