Begin typing your search above and press return to search.
మొదటి రోజు పర్లేదు.. అంతే!!
By: Tupaki Desk | 11 Feb 2017 7:00 AM GMTకోలీవుడ్ హీరో సూర్య నటించిన సింగం సీక్వెల్ ఎస్3 థియేటర్లలో వచ్చేసి సందడి చేస్తోంది. ఎన్నెన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు విడుదలైంది ఈ మూవీ. దీపావళి నుంచి మొదలుపెడితే.. ఇప్పటివరకూ అనేకసార్లు పోస్ట్ పోన్ మెంట్స్ జరిగాక.. చివరకు అభిమానుల ముందుకు వచ్చిన మూవీకి.. మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎస్3 వసూళ్లు బాగానే ప్రారంభమయ్యాయి. మాస్ మసాలా పోలీస్ మూవీ ఎస్3 కి.. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 4.8 కోట్ల గ్రాస్.. 3.39 కోట్ల షేర్ దక్కాయి. ప్రధానంగా నైజాంలో 1.15 కోట్లతో అదరగొట్టగా.. సీడెడ్ లో 70 లక్షలు.. ఉత్తరాంధ్రలో 40 లక్షలు.. గంటూరు 33 లక్షలు.. కృష్ణా 21 లక్షలు.. ఈస్ట్ 23 లక్షలు.. వెస్ట్ 21 లక్షలు.. నెల్లూరు 16 లక్షల వసూళ్లు దక్కాయి. తెలుగు వెర్షన్ వరకు చూసుకుంటే మంచి ఓపెనింగ్స్ అనే చెప్పాలి.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ్ కలిపి తొలి రోజున 17.6 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. తమిళనాడులో 9 కోట్ల గ్రాస్.. ఏపీ నైజాంలో కలిపి 4.8 కోట్లు.. కేరళ 1.8 కోట్లు.. కర్నాటకలో 1. కోట్లు.. రెస్టాఫ్ ఇండియా 0.4 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులు.. మూవీ కలెక్షన్స్ పై బాగానే ప్రభావం చూపాయి. తొలి రెండు భాగాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచిన తర్వాత ఎస్3 పై ఉన్న అంచనాలతో పోల్చితే.. ఈ ఫిగర్స్ తక్కువ అనే చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే.. మొదటి రోజున మూడో యముడు పర్లేదనిపించాడంతే.