Begin typing your search above and press return to search.

సింగం!! హైకోర్టు పంచ్ పడిందా!?

By:  Tupaki Desk   |   15 Dec 2016 5:30 PM GMT
సింగం!! హైకోర్టు పంచ్ పడిందా!?
X
సింగం సిరీస్ లో మూడో భాగంగా వస్తున్న ఎస్3 వాయిదా పడిందనే విషయం తెలిసిందే. ఈ పోస్ట్ పోన్ పై 2-3 రోజులుగా వార్తలు ఉన్నా.. 'పలు ఎక్స్ టర్నల్ కారణాలతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది' అంటూ స్వయంగా సూర్యనే ట్వీట్ చేయడంతో.. ఎస్3 వాయిదా అధికారికం అయిపోయింది. అయితే.. మొత్తం రెడీ అయిపోయి.. సెన్సార్ కి కూడా పంపిన సినిమాను ఎందుకు వాయిదా వేసుకోవాల్సి వచ్చిందనే డౌట్ చాలామందిని వెంటాడుతోంది.

ఈ వాయిదా వెనుక అసలు ఏంటో ఇప్పుడు తెలియవచ్చింది. రీసెంట్ గా సెన్సార్ బోర్డుకు చెన్నై హైకోర్టు అక్షింతలు పడ్డ విషయం తెలిసిందే. దీంతో కఠినంగా వ్యవహరించిన సెన్సార్ వర్గాలు.. సూర్య నటించిన ఎస్3కి సెన్సార్ బోర్డ్ వాళ్లు U/A సర్టిఫికేట్ అందించారట. కానీ సూర్య మాత్రం ఈ మూవీకి U సర్టిఫికేట్ ఆశించాడట.

అందుకే తన సినిమాకి యూ/ఏ ఇవ్వడాన్ని ఏ మాత్రం యాక్సెప్ట్ చేయలేని సూర్య.. ఎస్3 మూవీని రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించుకున్నాడట. అందుకోసం సమయం అవసరం కావడంతో.. ముందుగానే వాయిదా సంగతి అనౌన్స్ చేసేసినట్లు తెలుస్తోంది. అయితే.. అన్ని పనులు పూర్తి చేసుకుని డిసెంబర్ 30కి విడుదల చేయాలనేది ప్లాన్. మరి రీ-సెన్సార్ అవుతుందా? అయినా కత్తులు గన్నులూ నెత్తుటి చుక్కలతో రచ్చ చేసే మూవీకి 'యు' సర్టిఫికేట్ ఎలా ఇస్తారు గురూ?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/