Begin typing your search above and press return to search.
లాజిక్ అదిరింది చైతూ...
By: Tupaki Desk | 29 Aug 2015 12:56 PM GMTతండ్రి నాగార్జున బర్త్ డే సందర్భంగా... తన కొత్త సినిమా టీజర్ రిలీజ్ చేశాడు నాగచైతన్య. గౌతమ్ మీనన్ - నాగ చైతన్య కాంబినేషన్ లో రూపొందుతున్న 'సాహసం శ్వాసగా సాగిపో' టీజర్ భలే క్యూట్ గా ఉంది. పక్కింటబ్బాయిలా ఉన్నాడే అనేంత సింపుల్ గా ఉన్నాడు చైతూ. మాటలను కూడా కాజువల్ గా రాసేసుకున్నారు. ఫ్రెండ్, లవర్ అంటూ చెప్పిన ఓ లాజిక్ అయితే భలే సెట్టయింది.
నిన్నొచ్చిందిరా లీల... అంటూ మొదలుపెట్టి.. అరేయ్ ఫ్రెండ్ చెల్లి... చెల్లెలు అవుతుంది కానీ... చెల్లెలు ఫ్రెండ్ చెల్లి అవాల్సిన అవసరం లేదుగా అంటూ చైతన్య క్వశ్చన్ అడుగుతాడు. ఫ్రెండ్ చెల్లెల్ని చెల్లిగా చూసి.... చెల్లెలి ఫ్రెండ్ ని చెల్లిగా చూస్తే... ఇక మనకు అందరూ చెల్లెళ్లే ఉంటారంటూ... చైతు ఫ్రెండ్ ఆన్సర్ ఇస్తాడు.
కాలేజ్ కుర్రాళ్లు ఎలా మాట్లాడుకుంటారో... అంత నీట్ గా, క్యూట్ గా ఉన్నాయి డైలాగ్స్. టీజర్ చివర్లో లవ్, క్లీన్ ప్యూర్ లవ్ అంటూ తన మార్క్ టచ్ ఇచ్చాడు గౌతం మీనన్. రొమాంటిక్ సినిమాలు, సన్నివేశాలు చేయడంలో పండిపోయినట్లుగా ఉంది నాగచైతన్య యాక్టింగ్ చూస్తే. ఏమైనా రొమాన్స్ అక్కినేని ఫ్యామిలీకి బ్లడ్ లోనే ఉందనుకుంటా.