Begin typing your search above and press return to search.

ట్రైలర్‌ టాక్‌: జీవితగమ్యం చెబుతున్న చైతూ

By:  Tupaki Desk   |   1 Jun 2016 12:55 PM GMT
ట్రైలర్‌ టాక్‌: జీవితగమ్యం చెబుతున్న చైతూ
X
అక్కినేని నాగ చైతన్య.. చాలా రోజుల నుండి గౌతమ్‌ మీనన్‌ డైరక్షన్‌ లో వస్తున్న ''సాహసం సాగిపో స్వాశగా'' సినిమాతో ఊరిస్తున్నాడు. ఎన్నాళ్ళ నుండో వెయిట్‌ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు డైరెక్టుగా ఆన్‌ లైన్ లో రిలీజ్‌ చేసేశారు. పదండి ఈ ట్రైలర్‌ ఎలా ఉందో చూద్దాం.

ఒక అమ్మాయి ప్రేమలో పడిన యువకుడు.. ఏదన్నా జాబ్‌ టేకప్ చేసేముందు ఒక చిన్న రోడ్‌ ట్రిప్‌ వెళ్లొద్దాం అంటాడు. అప్పుడు చైతూ జీవితం స్టార్టవుతుంది. ప్రియురాలు (మంజిమా మోహన్‌)తో కలసి రోడ్ ట్రిప్ కు వెళ్లే దారిలో.. చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని అధిగమించడమే జీవితం అని ప్రూవ్‌ చేస్తాడు ఈ కుర్రాడు. ''జీవితంలో చాలా చూశాకే చావడం కష్టం అనిపిస్తుంది. మనం ఏమీ చూడ్లేదు. చచ్చినా పర్లేదు'' అనే ఒకే ఒక్క డైలాగుతో మొత్తం సినిమాను చక్కగా సమ్మరైజ్ చేశాడు దర్శకుడు గౌతమ్‌ మీనన్.

లైఫ్ లో ఏం జరిగినా కూడా ఫేస్ చేయడానికి సిద్దంగా ఉన్న ఒక హీరో కథను బాగా చెప్పాడు దర్శకుడు. నిజానికి గౌతమ్‌ మీనన్‌ సినిమాల్లో ప్రేమ.. మరియు థ్రిల్‌ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి. ఆ రెండింటినీ కలిపి ఈ సినిమాలో బాగానే చూపించినట్లున్నాడు. రెహ్మాన్‌ స్కోర్ అంత ఇంప్రెసివ్ గా ఏమీ లేదు. మంజిమా మోహన్‌ కూడా సోసోగా ఉంది.